పాల్ ఎఫెక్ట్.. వర్మకు సైబర్ క్రైమ్ పోలీసుల షాక్..

వివాదాస్పద డైరక్టర్ రాంగోపాల్‌వర్మ‌కు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ ఫిర్యాదుతో ఆర్టీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రంలో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వాడారంటూ కేఏ పాల్.. వర్మపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. తాను కూడా కేఏ పాల్‌పై పరువు నష్టం దావా వేస్తానంటున్నారు ఆర్జీవీ. కాగా.. ఆర్జీవీ ఈ సినిమా షూటింగ్ […]

పాల్ ఎఫెక్ట్.. వర్మకు సైబర్ క్రైమ్ పోలీసుల షాక్..
Follow us

| Edited By:

Updated on: Dec 16, 2019 | 12:37 AM

వివాదాస్పద డైరక్టర్ రాంగోపాల్‌వర్మ‌కు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ ఫిర్యాదుతో ఆర్టీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రంలో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వాడారంటూ కేఏ పాల్.. వర్మపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. తాను కూడా కేఏ పాల్‌పై పరువు నష్టం దావా వేస్తానంటున్నారు ఆర్జీవీ.

కాగా.. ఆర్జీవీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పట్నుంచి రిలీజ్ వరకు అనేక వివాదాలు నడిచాయి. అంతేకాదు.. ఈ వివాదాల మధ్య సినిమా రిలీజ్ కూడా సస్పెన్స్‌గా మారింది. చివరకు డిసెంబర్-12న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో లుక్స్, టీజర్, సాంగ్స్‌‌లో తనను అవమానించారంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.