Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

5గురు పోలీసులపై హైదరాబాద్ సీపీ వేటు..ఎందుకో తెలుసా?

విధుల్లో నిర్లక్ష్యం చూపినందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. పరిపాలనా ప్రాతిపదికన ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఐదుగురు పోలీసులను సోమవారం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సిఎఆర్) కు ఎటాచ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ మాట్లాడుతూ.. సస్పెండ్ చేసిన అధికారుల వివరాలను వెల్లడించారు. హుమయూన్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ కె. సత్యనారాయణ, బంజారా హిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్..బంజారా హిల్స్‌కు చెందిన కానిస్టేబుల్ కె. రంజిత్ కుమార్, బంజారా హిల్స్ ఠాణాకు చెందిన హెం గార్డు బి. అంజయ్య ..పంజాగుట్టకు చెందిన కానిస్టేబుల్ ఎల్లిషా కిరణ్‌లు తమను సంప్రదించిన వ్యక్తి నుండి ఫిర్యాదు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చూపించారు.

సెప్టెంబరు 29 న, ఫిర్యాదుదారుడు తీసుకొచ్చిన కేసును తమ పోలీస్ స్టేషన్ యొక్క అధికార పరిధికి సంబంధించినది కాదని చెప్పి, అతడిని 10 గంటలకు పైగా ఆయా  సర్కిల్స్‌లో తిరిగేలా చేశారని పోలీసు కమిషనర్ తెలిపారు. చివరకు సెప్టెంబర్ 30 న సదరు కేసును సైఫాబాద్ పోలీసులు చేపట్టారు. మసాబ్ ట్యాంక్ ప్రాంతంలోని బంజారా ఫంక్షన్ హాల్ సమీపంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారుడు కోరినట్లు పోలీసు  వర్గాలు తెలిపాయి. పోలీసు అధికారుల వృత్తిపరమైన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా..ఇటువంటి చర్యలు తీుకున్నట్లు అంజనీ కుమార్ తెలిపారు.