హెల్మెట్ మస్ట్ : పోలీసుల కోసం కాదు… మీ కోసం..

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ సూచించారు. వ్యక్తిగత భద్రత కోసమే హెల్మెట్ ధరించాలి కానీ...

హెల్మెట్ మస్ట్ : పోలీసుల కోసం కాదు... మీ కోసం..
Follow us

|

Updated on: Jul 09, 2020 | 1:03 PM

Hyderabad CP Anjani Kumar Says Motorists Must wear Helmets : వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ సూచించారు. వ్యక్తిగత భద్రత కోసమే హెల్మెట్ ధరించాలి కానీ… పోలీసుల తనిఖీ కోసం కాదని అన్నారు. కరోనా పెరుగుతున్న దృష్ట్యా మాస్క్ తోపాటు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని అన్నారు. టూ వీలర్ పై ప్రయాణిస్తున్నవారు హెల్మెట్ పెట్టుకుని మాస్క్ ధరించకుంటే కరోనాకు చిక్కుతారని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేలాది మంది దుర్మరణం చెందడంతోపాటు లక్షలాది మంది క్షతగాత్రులవుతున్నారు. లక్షలాది మంది దివ్యాంగులుగా మారుతున్నారు.  ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబ సభ్యులను కోల్పోయి అనాధలుగా మారుతున్న చిన్నారుల సంఖ్య వేలల్లో ఉంటోంది.  రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న ద్విచక్ర వాహనదారుల్లో 70 శాతం మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయాలవడంతో మరణిస్తున్నారు.  పోలీసులు తీసుకుంటున్న చర్యలు వాహనదారుల భద్రత కోసమని భావించాలే తప్పా… పోలీసుల కోసం హెల్మెట్ పెట్టుకోవద్దని గుర్తు చేస్తున్నారు హైదరాబాద్  పోలీసులు.