బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుః ప్రాథమిక విచారణలో బయటపడ్డ నిజాలు.. మాజీ మంత్రి అఖిలప్రియ దంపతులతోసహా పలువురి అరెస్ట్

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసును త్వరగా ఛేదించామన్నారు సీపీ. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు ఏవీ సుబ్బారెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుః ప్రాథమిక విచారణలో బయటపడ్డ నిజాలు.. మాజీ మంత్రి అఖిలప్రియ దంపతులతోసహా పలువురి అరెస్ట్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 07, 2021 | 6:24 AM

ఐటీ అధికారులమంటూ నకిలీ సెర్చ్ వారంట్ చూపిన నిందితులు ముగ్గురు అన్నదమ్ముళ్లను కిడ్నాప్ చేశారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ ఫుటేజీల అధారంగా కేసును త్వరగా ఛేదించామన్నారు సీపీ. అయితే గత కొంతకాలంగా ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు సుబ్బారెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. కుటుంబసభ్యులను ఓ గదిలో బంధించి ప్రవీణ్‌రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్‌ చేశారన్నారు. 10 – 15 మంది వ్యక్తులు కిడ్నప్ లో పాల్గొన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 15 బృందాలు రంగంలోకి దిగి గాలింపుచర్యలు చేపట్టామన్నారు. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్‌లను వికారాబాద్‌లో గుర్తించామని. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా…మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్‌లు కీలకంగా ఉన్నారు. దీంతో ఎ1గా సుబ్బారెడ్డి, ఎ2గా అఖిలప్రియ, ఎ3గా భార్గవ్‌రామ్ పేర్లను చేర్చినట్లు సీపీ వెల్లడించారు. హాఫీజ్‌పేటలోని వంద కోట్ల విలువైన 25 ఎకరాల భూమి కోసం కొంతకాలంగా గొడవ జరుగుతున్నట్లు సీపీ తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

అంతకుముందు బేగంపేట మహిళా పీఎస్ నుంచి మాజీమంత్రి అఖిలప్రియను గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. గాంధీ ఆస్పత్రిలో అఖిలప్రియకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను రిమాండ్‌కు తరలిస్తామని సీపీ అంజన్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి జరిగిన కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బోయినపల్లిలో కిడ్నాప్‌కు గురైన ముగ్గురు సోదరులను కిడ్నాపర్లు నార్సింగిలో వదిలి పారిపోయారు. దీంతో ప్రవీణ్, నవీన్, సునీల్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. గత రాత్రి 11 గంటల సమయంలో సినీఫక్కీలో వారు కిడ్నాప్‌కు గురయ్యారు.

ఇదీ చదవండి… Bhuma Akhila Priya Arrest: భూమా అఖిలప్రియ అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు..