కోడెల పర్సనల్ ఫోన్ మిస్సింగ్.. కాల్ డేటా పై పోలీసుల ఆరా..!

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కోడెల కూతురు విజయలక్ష్మీ ఫిర్యాదుతో సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కేబుల్ వైర్, కోడెల పంచె, షర్ట్ సీజ్ చేసి.. ఫోరెన్సి‌క్‌కు పంపించారు. కాగా, కోడెల పర్సనల్ ఫోన్ మిస్సైనట్లు పోలీసులు గుర్తించారు. కోడెల కాల్ డేటాను పరిశీలించగా చివరిగా 24 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆయన ఫోన్ […]

కోడెల పర్సనల్ ఫోన్ మిస్సింగ్.. కాల్ డేటా పై పోలీసుల ఆరా..!
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 3:19 PM

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కోడెల కూతురు విజయలక్ష్మీ ఫిర్యాదుతో సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కేబుల్ వైర్, కోడెల పంచె, షర్ట్ సీజ్ చేసి.. ఫోరెన్సి‌క్‌కు పంపించారు. కాగా, కోడెల పర్సనల్ ఫోన్ మిస్సైనట్లు పోలీసులు గుర్తించారు. కోడెల కాల్ డేటాను పరిశీలించగా చివరిగా 24 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆయన ఫోన్ కోసం.. పోలీసులు సోదాలు జరుపుతున్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అయితే చివరిగా ఎవరితో ఫోన్ మాట్లాడి వుంటారు..? ఆయన ఫోన్ ఎలా మిస్ అయింది..? ఫోన్‌ను ఎవరైనా దొంగిలించారా..? లేక దాచిపెట్టారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, గుంటూరు జిల్లా నరసారావుపేటలో కోడెల భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక, అంత్యక్రియల తర్వాత ఆయన కుమారుడిని విచారించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, రెండు గంటల పాటు కోడెల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు ఉస్మానియా వైద్యులు. హెడ్ బోన్ ఫ్రాక్ఛర్‌తో ఊపిరాడక ఆయన మృతి చెందినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.