కరోనావైరస్ 400 జన్యు శ్రేణులను డీకోడ్ చేసిన సిసిఎంబి

తెలంగాణ‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) 400 కరోనావైరస్ కు సంబంధించిన‌ జన్యు శ్రేణులను డీకోడ్ చేసి, వాటిని క‌రోనా వైర‌స్ గ్లోబ‌ల్ డేటా బేస్ కు అందించింది.

కరోనావైరస్ 400 జన్యు శ్రేణులను డీకోడ్ చేసిన సిసిఎంబి
Follow us

|

Updated on: Aug 04, 2020 | 10:22 PM

Corona Tests IN CCMB : తెలంగాణ‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) 400 కరోనావైరస్ కు సంబంధించిన‌ జన్యు శ్రేణులను డీకోడ్ చేసి, వాటిని క‌రోనా వైర‌స్ గ్లోబ‌ల్ డేటా బేస్ కు అందించింది. మొత్తం ఇండియా నుంచి 2000 జ‌న్యు శ్రేణుల‌ను పంప‌గా, అందులో 400 తెలంగాణ‌లోని సిసిఎంబి నుంచే వెళ్లాయి. సిసిఎంబి ప్ర‌తి రోజూ వంద‌ల సంఖ్య‌లో క‌రోనా టెస్టులు చేస్తోంది. ఐసిఎంఆర్ రిఫ‌ర్ చేసిన‌ రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమెరేజ్ చైన్ రియాక్షన్ గా పిలిచే ప్ర‌తేక పరీక్షా పరికరాన్ని..టెస్టుల సంద‌ర్భంగా వినియోగిస్తోంది. కాగా జీవశాస్త్ర (లైఫ్‌సైన్సెస్) పరిశోధనల్లో సిసిఎంబి ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

హైదరాబాద్‌లోని తార్నాకలో 1977లో సిసిఎంబి ఏర్పాటైంది. జీవశాస్త్రానికి సంబంధించిన పరిశోధనల్లో అద్భుతమైన విజాలు సాధించి ప్రపంచ ప్ర‌ఖ్యాతి పొందింది. వివిధ రకాల జీవజాతులు, మనుషుల జన్యుక్రమాలను గుర్తించడం, మూలాలను కనుక్కోవడంతో పాటు జీవకణాల సృష్టిలో సిసిఎంబి కీలకపాత్ర పోషిస్తోంది.

Read More : వారికి రూ.15వేలు సాయం : జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న జీవో రిలీజ్