ముస్తాబైన కేబుల్ బ్రిడ్జి.. ఈనెల 19న ప్రారంభించనున్న కేటీఆర్

భాగ్యనగరవాసులు ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. హైదరాబాద్‌కి మరో ల్యాండ్‌మార్క్‌గా మారనున్న దుర్గం చెరువు కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. వాహనాల రాకపోకలకు వీలుగా అందంగా ముస్తాబైంది.

ముస్తాబైన కేబుల్ బ్రిడ్జి.. ఈనెల 19న ప్రారంభించనున్న కేటీఆర్
Follow us

|

Updated on: Sep 16, 2020 | 1:45 PM

భాగ్యనగరవాసులు ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. హైదరాబాద్‌కి మరో ల్యాండ్‌మార్క్‌గా మారనున్న దుర్గం చెరువు కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. వాహనాల రాకపోకలకు వీలుగా అందంగా ముస్తాబైంది. హైదరాబాద్‌లో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నా… దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిను మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈనెల 19న బ్రిడ్జిని ప్రారంభించేందుకు హైదరాబాద్ మహానగర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ వంతెన రోడ్‌ నెంబర్‌-45లోని ఫ్లై ఓవర్‌ను సాయంత్రం 5గంటలకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు ప్రారంభించనున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ మహానగరం ఐటీ, ఫార్మా రంగాలకు హబ్‌గా మారింది. ఐటీ ఉద్యోగుల రాకపోకలకు వీలుగా ఉండేలా… ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టింది జీహెచ్ఎంసీ. శని, ఆదివారం దీనిపై వాహనాలకు అనుమతి నిలిపివేసి.. ఆ రెండ్రోజులూ ప్రజలు, పర్యాటకులూ… ఈ బ్రిడ్జిపై వాకింగ్ చేయడం కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

రెండేళ్ల కిందట మొత్తం రూ.184 కోట్లతో జీహెచ్ఎంసీ ఈ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను ఎల్&టీకి అప్పగించింది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్ నగరానికి తలమానికంగా తీర్చిదిద్దారు. దేశంలో ఇలాంటి టెక్నాలజీతో తయారైన తొలి బ్రిడ్జి ఇదే కాబోతుంది.

రోడ్ నంబర్ 45ని మాదాపూర్‌తో కలుపుతూ 760 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు. ఈ సస్పెన్షన్ బ్రిడ్జి పొడవు 426 మీటర్లు. రెండు పిల్లర్ల మధ్య పొడవు 244 మీటర్లు. జర్మనీ టెక్నాలజీతో… 8 దేశాల ఇంజినీర్లు… దీన్ని 22 నెలలపాటు శ్రమించి పూర్తి చేశారు. దుర్గం చెరువు నీటి మట్టానికి 20 మీటర్ల ఎత్తులో బ్రిడ్జిని నిర్మించారు. ఒక్కో పైలాన్‌కీ 26 కేబుళ్లను వినియోగించారు. ఇక రాత్రి సమయంతో అందమై విద్యుత్ కాంతులు వెదజల్లేలా ప్రత్యేక లైట్లతో ఈ బ్రిడ్జి అత్యంత ఆకర్షణీయంగా కనిపించనుంది. ఈ సంవత్సరం జులై 20నే దీన్ని ప్రారంభించాల్సి ఉన్నా… కరోనా వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు పూర్తి చేసుకున్న కేబుల్ బ్రిడ్జి సెప్టెంబర్ 19 నుంచి అందరికి అందుబాటులోకి రానుంది. దీంతో హైటెక్ సిటీ ప్రాంతంలోని ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు