Live Updates: అఖిలప్రియ కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై వాదనలు పూర్తి.. తీర్పు సోమవారానికి వాయిదా వేసిన సికింద్రాబాద్ కోర్టు

| Edited By: Team Veegam

Updated on: Jan 19, 2021 | 5:59 PM

టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరుగనుంది. అఖిల ప్రియ ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకుని బెయిల్..

Live Updates: అఖిలప్రియ కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై వాదనలు పూర్తి.. తీర్పు సోమవారానికి వాయిదా వేసిన సికింద్రాబాద్ కోర్టు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ కోర్టులో విచారణ జరుగుతుంది. అనారోగ్యం దృష్ట్యా బెయిల్ కోరుతూ అఖిలప్రియ పిటిషన్ వేశారు. కాగా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. మరోవైపు కిడ్నాప్ కేసులో బుధవారం సాయంత్రం వరకు ఏ2గా ఉన్న అఖిలప్రియను గురువారం ప్రధాన నిందితురాలిగా మార్చారు. ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా మార్చారు. ప్రధాన నిందితుడైనా ఏవీకి.. 41ఏ నోటీసులు ఇచ్చి పంపించడంతో మళ్లీ ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.

ఇరుపక్షాల వాదనలు విన్న సికింద్రాబాద్ కోర్టు. . అఖిల ప్రియ బెయిల్‌, కస్టడీ పిటిషన్‌ను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అఖిల ప్రియ ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుపు న్యాయవాదులు కోర్టుకు అప్పీల్ చేశారు. శుక్రవారం పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు విచారణను వాయిదా వేసింది. అయితే, ఈ కేసులో మరో నిందితుడు అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. భార్గవ్ రామ్ ఆచూకీ కోసం 15 పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Jan 2021 06:53 PM (IST)

    ఆధారాలు లేకుండా అరెస్ట్ సరికాదుః మౌనిక

    మా అమ్మానాన్న ఆళ్లగడ్డకో.. కర్నూలుకో పరిమితమైన నేతలు కాదు. మా అమ్మ శోభా నాగిరెడ్డి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పోలీసులే కేసును నిర్ధారిస్తే కోర్టులు ఎందుకు. ఏ ఆధారాలతో అఖిలప్రియను అరెస్ట్‌ చేశారని భూమా మౌనిక ప్రశ్నించారు. అక్క తప్పు చేసిందని ఏ ఏవిడెన్స్ లేకుండా పోలీసులు ఎలా దృవీకరిస్తారన్నారు..

  • 08 Jan 2021 06:53 PM (IST)

    అఖిలప్రియ అరెస్ట్ వెనుక ఏపీ సర్కార్ హస్తంః మౌనిక

    తెలుగు రాష్ట్రాల్లో మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మౌనిక ఆరోపించారు. మా అక్క విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్తం కూడా ఇందులో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అక్కడ మా మనుషులను అధికార పార్టీ వారు బెదిరింపు లకు పాల్పడుతున్నారన్నారు.

  • 08 Jan 2021 06:36 PM (IST)

    మా కుటుంబానికి ప్రాణహాని ఉందిః మౌనికారెడ్డి

    హఫీజ్‌పేట్ ల్యాండ్ కు సంబంధించిన పేపర్స్ మాతో ఉన్నాయి.. మొత్తం 70 ఎకరాల ల్యాండ్ హఫీజ్ పేట్ లో ఉంది.. సివిల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే ఎవరైనా మధ్యవర్తిత్వం వహిస్తే తాము సెటిల్మెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నమని మౌనికారెడ్డి స్పష్టం చేశారు. మా అక్కకే రక్షణ లేదు.. భార్గవ్ రామ్ లొంగిపోతే ఆయనకు ఏమి భద్రత ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

  • 08 Jan 2021 06:17 PM (IST)

    భూవివాదంపై చర్చించడానికి సిద్ధంః మౌనికారెడ్డి

    హాఫీజ్‌పేట్ భూవివాదంపై చర్చించడానికి తమ కుటుంబం సిద్ధంగా ఉందని భూమా మౌనికారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ జరిగిన పరిణామాలు పూర్తిగా పొలిటికల్ గేమ్ లాగా అనిపిస్తుందని ఆరోపించారు. రోజుకో రకంగా నిందితుల వివరాలను ఎలా మారుస్తారని మౌనిక ప్రశ్నించారు. తల్లిదండ్రులు లేరని మరి ఇంతలా మాపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని మౌనిక మండిపడ్డారు. మా అక్కను లైట్స్ ఆఫ్ చేసి టెర్రరిస్టును అదుపులోకి తీసుకున్నట్లు అరెస్ట్ చేశారని మౌనిక అన్నారు..

  • 08 Jan 2021 06:01 PM (IST)

    అఖిలప్రియకు ప్రాణహాని ఉందిః మౌనికారెడ్డి

    అఖిలప్రియకు ప్రాణహాని ఉందని భూమా మౌనిక వాపోయారు. తమకు ఎక్కడా రక్షణ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచి అఖిలప్రియను తీసుకెళ్లే విధానం సరిగాలేదన్న మౌనికారెడ్డి.. ఆమె రహస్యంగా తీసుకెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. అఖిలప్రియ ఆరోగ్యం ఏమాత్రం బాగులేదని, జైలులో సరిగా భోజనం చేయడం లేదని ఆమె తెలిపారు. అఖిలప్రియ అనారోగ్యంతో బాధపడుతున్నా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలప్రియను జైల్లో ఉగ్రవాది కన్నా దారుణంగా చూస్తున్నారని, అఖిలప్రియకు వైద్యం అందించడం లేదని ఆరోపించారు.

  • 08 Jan 2021 05:47 PM (IST)

    అఖిలప్రియ హెల్త్ బులిటెన్‌ సమర్పించాలని కోర్టు ఆదేశాలు

    అఖిలప్రియ ఆరోగ్యంపై ఆమె తరపు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అఖిలప్రియ హెల్త్ బులిటెన్‌ను సోమవారం కోర్టుకు సమర్పించాలని చంచల్‌గూడ జైలు సూపరిడెంట్‌ను కోర్టు అదేశించింది. అంతకు ముందు అఖిలప్రియ జైళ్లో కింద పడిపోయారని కోర్టుకు సమర్పించిన మెమోలో అఖిలప్రియ న్యాయవాది పేర్కొన్నారు. అఖిలప్రియ ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని కోర్టుకు తెలియజేశారు. ఆమెను చికిత్స కోసం ఈఎన్‌టీ సర్జన్ వద్దకు తరలించాలని కోరారు. అలాగే అఖిలప్రియ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేయాలని జైలు అధికారులను ఆదేశించాలని న్యాయవాది కోర్టుకు విన్నివించుకున్నారు.

  • 08 Jan 2021 05:44 PM (IST)

    అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా

    అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్యం దృష్ట్యా బెయిల్ కోరుతూ అఖిలప్రియ తరుపున ఆమె న్యాయవాది పిటిషన్ వేశారు.కాగా, బెయిల్ మంజూరు చేయవద్దంటూ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.

  • 08 Jan 2021 05:26 PM (IST)

    హడలెత్తిస్తున్న హఫీజ్‌పేట్‌ సర్వే నంబర్‌ - 80

    హఫీజ్‌పేట్‌ సర్వే నంబర్‌-80.. దశాబ్దాలుగా వివాదాలు కొనసాగుతోంది. కోర్టు కేసులతో.. హత్యలు-ప్రతికార దాడులతో దాదాపు పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. తాజాగా బోయిన్‌పల్లిలో కటికనేని ప్రవీణ్‌కుమార్‌, అతని సోదరుల కిడ్నాప్‌‌కు.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టుకు అనేక వివాదాలకు ఈ స్థలం ప్రధాన కారణమైంది. అయితే ప్రవీణ్‌ రావు, ఆయన సోదరుల కిడ్నాప్‌ వ్యవహారంలో పాత్రధారులు తప్పించుకున్నా.. సూత్రధారి ఆరోపణలపై భూమా అఖిలప్రియను బుధవారం అరెస్టు చేసి జైలుపాలు చేశారు.

  • 08 Jan 2021 04:59 PM (IST)

    అఖిల ప్రియ బెయిల్ పిటీషన్ పై ముగిసిన వాదనలు

    అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అనారోగ్యం దృష్ట్యా బెయిల్ కోరుతూ అఖిలప్రియ తరుపున ఆమె న్యాయవాది పిటిషన్ వేశారు. ఇందుకు సంబంధించి పూర్తి మెమోను దాఖలు చేశారు. కాగా, అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అఖిలప్రియ బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పోలీసులు పేర్కొన్నారు. బెయిల్ పిటీషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న సికింద్రాబాద్ కోర్టు.. తీర్పును 5గంటలకు వాయిదా వేసింది.

  • 08 Jan 2021 04:55 PM (IST)

    అఖిలప్రియ ఆరోగ్యంపై మెమో దాఖలు చేసిన న్యాయవాది

    అఖిలప్రియ ఆరోగ్యంపై ఆమె తరపు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు. అఖిలప్రియ జైళ్లో కింద పడిపోయారని మెమోలో పేర్కొన్న న్యాయవాది.. అఖిలప్రియ ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని కోర్టుకు తెలియజేశారు. ఆమెను చికిత్స కోసం ఈఎన్‌టీ సర్జన్ వద్దకు తరలించాలని కోరారు. అలాగే అఖిలప్రియ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేయాలని జైలు అధికారులను ఆదేశించాలని న్యాయవాది కోర్టుకు విన్నివించుకున్నారు.

  • 08 Jan 2021 04:41 PM (IST)

    ఏవీ సుబ్బారెడ్డికి కిడ్నాప్‌తో సంబంధం లేదుః పోలీసులు

    ఏవీ సుబ్బారెడ్డికి కిడ్నాప్‌తో సంబంధం లేదని, పాత కేసు నేపథ్యంలో అనుమానించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర లేనందున నోటీసులిచ్చి పంపించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే, తాను పోలీసులకు అందుబాటులో ఉంటానని, ఎప్పుడు పిలిచినా వెంటనే వస్తానని సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం.

  • 08 Jan 2021 04:33 PM (IST)

    న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌ను కలుస్తాంః అఖిలప్రియ సోదరుడు

    అక్కకు ఆరోగ్యం బాగులేక ఇబ్బంది పడుతూ వేధిస్తున్నారని... తమకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌ను కలిసి కోరుతామని అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులను లేని మమ్మల్ని టార్గెట్ చేసి ఆస్తులు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ పోలీసులు కుట్ర పూరితంగా కేసులు పెట్టి ఇరికించారన్నారు. హైదరాబాద్ లో కేసు నమోదైతే ఆళ్లగడ్డలో తమ అనుచరులను వేధిస్తున్నారని జగత్ రెడ్డి అన్నారు. కిడ్నాప్ కేసులో FIR లో ఉన్న పేర్లను పోలీసులు వెంటనే బయటపెట్టాలన్న జగత్ రెడ్డి.. వారందరూ కిడ్నాప్ సమయంలో ఎక్కడా ఉన్నారో పోలుసులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి... మా కుటుంబానికి న్యాయం చేయాలని జగత్ విఖ్యాత్ రెడ్డి కోరారు.

  • 08 Jan 2021 04:28 PM (IST)

    హఫీజ్ పేట్ 25 ఎకరాల భూమి మాదేః జగత్ విఖ్యాత్ రెడ్డి

    బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుపై మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందించారు. మా అక్క అఖిలప్రియను ఈ కేసులో వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళనవ్యక్తం చేశారు. భూమా ఫ్యామిలీని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జగత్ ఆరోపించారు. తమ కుటుంబసభ్యులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేదింపులకు గురిచేస్తున్నారన్నారు. హఫీజ్ పేట్‌లోని 25 ఎకరాల భూమి మాదేనని, నాన్న భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడే కొనుగోలు చేశామన్నారు. తమ ఆస్తులు కాజేయలని పెద్ద కుట్ర జరుగుతుందన్న జగత్... మా అక్కకు ఆరోగ్యం బాగులేక ఇబ్బంది పడుతూ వేధిస్తున్నారని ఆరోపించారు.

  • 08 Jan 2021 04:23 PM (IST)

    అఖిలప్రియను 7 రోజుల కస్టడీకి కోరిన పోలీసులు

    ఈ కేసులో మంత్రి అఖిలప్రియను 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. మరికొన్ని కేసుల్లో అఖిలప్రియ అనుచరుల ప్రమేయం ఉందని తేలిందని, అఖిలప్రియ భర్త సహా మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. నిందితులను అరెస్టు చేశాక కిడ్నాప్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని, రేపటి నుంచి ఈనెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు.

  • 08 Jan 2021 04:13 PM (IST)

    అఖిలప్రియ చర్యల వల్ల ప్రజల్లో అభద్రతాభావంః పోలీసులు

    మాజీ మంత్రి అఖిలప్రియ చర్యల వల్ల స్థానిక ప్రజల్లో అభద్రతాభావం నెలకొని ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉన్న నాయకురాలు అని పోలీసులు పేర్కొన్నారు. అఖిలప్రియ బెయిల్ పై విడుదలైతే దర్యాప్తును, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని పోలీసులు వివరించారు. అఖిలప్రియ బెయిల్ పై విడుదలైతే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చన్న పోలీసులు.. ఈ కేసు దర్యాప్తుకు అటంకం కలిగించే అవకాశముందన్నారు. అఖిలప్రియ బెయిల్ ఇస్తే కేసు విచారణ నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.

  • 08 Jan 2021 04:11 PM (IST)

    కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు

    బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయవద్దని హైదరాబాద్ పోలీసులు కౌంటరు దాఖలు చేశారు. భూమా అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం ఏ మాత్రం లేదని కోర్టుకు వివరించారు పోలీసులు.

  • 08 Jan 2021 04:10 PM (IST)

    అఖిలప్రియకు బెయిల్ వస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయిః పోలీసులు

    ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను సేకరించేందుకు దర్యాప్తు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, త్వరలోనే ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని పోలీసులు పేర్కోన్నారు. అఖిలప్రియ బెయిల్ పై వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కోర్టుకు నివేదించారు పోలీసులు.

  • 08 Jan 2021 02:15 PM (IST)

    డోలాయమానంలో అఖిల స్థితి, ఇప్పటికే ఒకసారి బెయిల్ విషయంలో చుక్కెదురు

    బెయిల్ విషయంలో ఇప్పటికే ఒకసారి కోర్టును అభ్యర్థించిన భూమా అఖిలప్రియకు చుక్కెదురవడంతో ఇవాళ్టి కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక పక్క గర్భవతి కావడం, మరోపక్క కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అఖిల చెబుతుండటంతో కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందనేది హాట్ టాపిక్ అయింది. బెయిల్‌ మంజూరు చేయాలని అఖిల తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం నేటికి (ఈనెల 8) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జైలులో సరైన వైద్య సదుపాయాలు లేనందున ఆమెకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించడానికి అనుమతి ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వేసిన మరో పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసి, జైల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించిన సంగతి విదితమే.

  • 08 Jan 2021 02:07 PM (IST)

    భూమా అఖిల ప్రియకు ఖైదీ నెంబరు1509, నిలకడగా ఆరోగ్యం, జైలు క్యాంటీన్లో సరకులు కొనుక్కోడానికి ఖాతాలో రు.5,000 జమ

    బెయిల్ కోసం ఎదురుచూస్తోన్న అఖిలప్రియ ప్రస్తుతం చంచల్‌గూడ మహిళా జైల్లో ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. జైలు అధికారులు ఆమెకు1509 నంబరును కేటాయించారు. మాజీమంత్రి అయినా సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఆనారోగ్యం కారణంగా అఖిలప్రియ జైలు వైద్యుల సంరక్షణలో ఉన్నారు. ఆమెకు దుస్తులు, ఇతర వస్తువులు అందించేందుకు బంధువులు రాగా, జైలు క్యాంటీన్లో సరకులు కొనుక్కోడానికి ఆమె ఖాతాలో రు.5,000 జమ చేసినట్లు తెలిసింది.

  • 08 Jan 2021 02:01 PM (IST)

    కష్టకాలంలో పక్కనే ఉండాల్సిన భర్త పరారీలో.. జైలుకు - బెయిలుకు మధ్య గర్భవతి

    అఖిలప్రియ కష్టాలకు ప్రధాన కారకుడు ఆమె భర్త భార్గవ్ రామ్ అనేది సుస్పష్టమవుతోంది. భూమా అఖిలప్రియ తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోతే, తండ్రి గుండెపోటుతో మరణించారు. తండ్రికి అత్యంత ఆప్తమిత్రుడైన సుబ్బారెడ్డి ఇప్పుడు ప్రత్యర్థిగా మారిపోయాడు. ఈ నేపథ్యం ఒకవైపైతే, మరోపక్క గర్భవతి, జైల్లో గడపాల్సిన స్థితి. బెయిల్ కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. ఈ పరిస్థితుల్లో భూమా అఖిలప్రియకు అండగా నిలవాల్సిన భర్త భార్గవ్ రామ్ పత్తాలేకుండా పోయాడు. ఇదీ.. భూమా అఖిలప్రియ ఎదుర్కొంటోన్న తాజా పరిస్థితి.

  • 08 Jan 2021 01:25 PM (IST)

    'భూమంత్రకాళి...' వేల కోట్లు విలువ చేసే ఆ ల్యాండ్‌ కొట్టేసేందుకే కిడ్నాప్ స్కెచ్ అంతా.!

    బోయినపల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కథ వెనుక పెద్ద భూమంత్రకాళి దాగి ఉంది. వేల కోట్ల విలువ చేసే ఆ ల్యాండ్‌ ఎలాగోలా చేజిక్కించుకునేందుకే క్లియర్ చేసుకునేందుకే ఈ స్కెచ్ అంతా. మరి కిడ్నాప్ చేసింది ఎవరు ? దీనికి కథ, స్క్రీన్‌ప్లే , డైరెక్షన్ చేసింది ఎవరో పోలీసులు విచారణలో రాబట్టారు. గుంటూరు శ్రీను దీనికి మాస్టర్ మైండ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భూమా ఫ్యామిలీకి, అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే శ్రీను ముందుండి కథ నడిపించినట్టు తెలుస్తోంది.

  • 08 Jan 2021 01:21 PM (IST)

    కిడ్నాప్ ఎపిసోడ్ అంతా సినీపక్కీలో ప్లాన్ చేసిన గుంటూరు శ్రీను, అతని నేరచరిత్రపై పోలీస్ ఫోకస్

    హఫీజ్‌పేట్ భూ వ్యవహారానికి సంబంధించి బోయిన్ పల్లి కిడ్నాప్ అంతా సినీపక్కీలో ప్లాన్ చేశాడు గుంటూరు శ్రీను. శ్రీను సలహామేరకు ముఠా సభ్యులు కృష్ణానగర్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో ఉండే డ్రామా డ్రెస్ కంపెనీ లో ఐటీ అధికారుల డ్రెస్‌లను అద్దెకు తీసుకున్నట్టు తేలింది. భార్గవ్ రామ్‌కు రైట్‌హ్యాండ్‌గా, అఖిలప్రియ కుటుంబానికి నమ్మదగ్గ వ్యక్తిగా శ్రీను వ్యవహరిస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది. భూమా ఫ్యామిలీకీ, భార్గవ్ రామ్ కు కీలక అనుచరుడుగా వ్యవహరిస్తున్న మాడాల శ్రీను నేరచరిత్రపై ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • 08 Jan 2021 01:11 PM (IST)

    హఫీజ్‌పేట్ భూ వ్యవహారంలో కిడ్నాప్ ముఠా నాయకుడు గుంటూరు శ్రీను.!

    హఫీజ్‌పేట్ భూ వ్యవహారంలో కిడ్నాప్ ముఠా నాయకుడు గుంటూరు శ్రీను అని తెలుస్తోంది. గుంటూరుకు చెందిన మాడాల శ్రీను, భూమ అఖిలప్రియ కుటుంబ వ్యవహారాలను అన్నీ తానై నడిపిస్తాడని సమాచారం. నంద్యాల ఉపఎన్నికలోనూ గుంటూరు శ్రీనే కీలకంగా వ్యవహరించాడు. కాగా, శ్రీను లగ్జరీ జీవితంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సరదాలకు హెలికాప్టర్లు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తోన్న గుంటూరు శ్రీను, బోయిన్ పల్లి కిడ్నాప్ ఎలా చేయాలి, ఎలా వెళ్లాలి అన్న స్కేచ్ తానే గీసినట్టు భావిస్తున్నారు.

  • 08 Jan 2021 12:19 PM (IST)

    పరారీలో ఉన్న భార్గవ్‌ రామ్ కోసం గాలింపు, మైసూర్‌కు మరో బృందం

    బోయిన్ పల్లి ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటికే ఏ1గా ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలిప్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఏ2గా ఏవీ సుబ్బారెడ్డిగా పేర్కొంటూ ఆయన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఏ3గా ఉన్న భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్ పరారీలో ఉన్నాడు. ఇక భార్గవ్ రామ్ జాడ కనుగొనేందుకు తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసుల సహాయం కూడా తీసుకుంటున్నారు. అయితే బెంగళూరులో భార్గవ్‌రామ్ ఉన్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. తాజాగా భార్గవ్ రామ్ మైసూరులో తలదాచుకున్నట్లు భావించి, అక్కడికి మరొక బృందాన్ని పంపించారు.

  • 08 Jan 2021 12:06 PM (IST)

    'గ్యాంగ్‌' సినిమాలో ఐటీ రైడ్ సీన్‌ ఫాలో అయ్యారు.!

    బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో సదరు స్థలం పేపర్లు స్వాధీనం చేసుకునేందుకు 'గ్యాంగ్‌' సినిమాలో ఐటీ రైడ్ సీన్‌ని ఫాలో అయ్యారు. ఆ సినిమాని కిడ్నాప్‌ గ్యాంగ్‌కి నాలుగు, ఐదు సార్లు చూపించారని తెలుస్తోంది. అంతేకాదు, ప్రవీణ్ రావు ఇంటి పరిసరాల్లో దాదాపు 10 రోజుల పాటు రెక్కీ నిర్వహించారు.

  • 08 Jan 2021 11:48 AM (IST)

    భార్గవ్‌రామ్ ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రీనివాస్‌ చౌదరితో కిడ్నాప్ ప్లాన్.!

    హఫీజ్‌పేట ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉన్న భూమి తమదేనంటూ...భూమా ఫ్యామిలీ, ప్రవీణ్‌రావు ఫ్యామిలీపై కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి చేస్తూ వచ్చింది. సదరు 48 ఎకరాల స్థలం కాజేయాలన్న పథకంలో భాగంగానే కిడ్నాప్‌కు స్కెచ్ వేశారు. ఇందుకోసం అఖిలప్రియ, భార్గవ్‌రామ్ తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన శ్రీనివాస్‌చౌదరితో కిడ్నాప్ ప్లాన్ చేశారు. తర్వాత చంటి, ప్రకాశ్‌ అనే వ్యక్తులతో పాటు మరికొందర్ని గ్యాంగ్‌లో చేర్చుకున్నారు.

  • 08 Jan 2021 11:48 AM (IST)

    అఖిలప్రియను అరెస్టు చేయకపోతే అనేక అనర్థాలని రిపోర్టులో పేర్కొన్న హైదరాబాద్‌ పోలీసులు

    బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలను పోలీసులు పొందుపరిచారు. అఖిలప్రియను అరెస్టు చేయకపోతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని న్యాయస్థానానికి సమర్పించిన రిపోర్టులో హైదరాబాద్‌ పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా అనేక మంది నిందితులు పరారీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. బాధితులతోపాటు వారి కుటుంబీకులపై మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితుల్ని అరెస్టు చేయడం ద్వారా బాధితులకురక్షణ కల్పించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.

  • 08 Jan 2021 11:20 AM (IST)

    అఖిలప్రియ భర్త భార్గవ్‌కు తెలిసిన స్కూల్‌ ఆవరణలో కార్ల నంబర్‌ ప్లేట్లను మార్చిన కిడ్నాపర్లు

    ప్రవీణ్‌ రావు సోదరుల ఇంటికి ఐటీ అధికారుల రూపంలో సోదాలకు వెళ్లే ముందు, నగర శివారు ప్రాంతంలోని అఖిలప్రియ భర్త భార్గవ్‌కు తెలిసిన స్కూల్‌ ఆవరణలో కార్ల నంబర్‌ ప్లేట్లను మార్చారు. అప్పటికే నకిలీ సెర్చ్‌ వారెంట్లు, ఐడీ కార్డులను భార్గవ్‌ తనకు తెలిసిన వారి వద్ద తయారు చేయించి కిడ్నాపర్లు ఇచ్చి ఇంట్లోకి డైరెక్ట్‌గా ఎంటర్ అయ్యేలా లైన్ క్లియర్‌ చేశారు. ఇంట్లోకి ప్రవేశించగానే కిడ్నాపర్లు తాము ఐటీ అధికారులమంటూ ఎవేవో పేపర్లు చూపిస్తూ... హడావుడి చేశారు. భూమి పత్రాలు వెదికేందుకు ఇంట్లో అన్ని గదుల్లో సోదాలు నిర్వహించారు. రియల్‌ ఐటీ ఆఫీసర్ల టైపులో ఫుల్ కలరింగ్ ఇచ్చారు.

  • 08 Jan 2021 11:08 AM (IST)

    ఐటీ అధికారులుగా బిల్డప్ ఇచ్చేందుకు కిడ్నాపర్లు వేసుకున్న డ్రెస్సులు ఫిల్మ్‌నగర్‌లో తయారు.!

    బోయిన్‌పల్లిలో ఉంటున్న 48 ఎకరాల భూమి యజమానులు ప్రవీణ్‌ రావు, నవీన్‌, సునీల్‌ని కిడ్నాప్ చేసేందుకు మూడ్రోజుల ముందు నుంచే వ్యూహం పన్నారని పోలీసులు భావిస్తున్నారు. తమని ఎవరూ ట్రేస్‌ చేసే ఛాన్సు ఇవ్వకూడదని కిడ్నాప్‌కి ముందు మూడ్రోజులు ఫోన్‌లు ఆఫ్ చేసుకున్నారు. ఎవరూ గుర్తుపట్టకుండా కార్లను ఎప్పటికప్పుడు మార్చారు. ప్రవీణ్‌రావు ఇంట్లోకి ఎంటర్ అయ్యేందుకు ...డ్రెస్‌ కోడ్ డిజైన్ చేశారు. 15మందిని ఐటీ, పోలీసు అధికారులుగా మార్చేసి టిప్‌- టాప్‌గా సూటు, బూట్లు వేసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. కిడ్నాపర్లు వేసుకున్న డ్రెస్సులు ఫిల్మ్‌నగర్‌లో తయారు చేయించినవిగా పోలీసులు భావించారు.

  • 08 Jan 2021 10:36 AM (IST)

    న్యాయస్థానానికి పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఆసక్తికర విషయాలు

    బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలను పోలీసులు పొందుపరిచారు. అఖిలప్రియను అరెస్టు చేయకపోతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని న్యాయస్థానానికి సమర్పించిన రిపోర్టులో హైదరాబాద్‌ పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్‌రామ్‌కు నేరచరిత్ర ఉందని, అఖిలప్రియను అరెస్టు చేయకపోతే ఇద్దరూ కలిసి నేరాలు కొనసాగించవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

  • 08 Jan 2021 10:31 AM (IST)

    అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ కోసం వెతుకులాట, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఒక పోలీస్ టీం

    అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌తోపాటు ఇతర నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. బెంగళూరుతోపాటు, ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భార్గవ్‌రామ్‌ ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఒక టీమ్‌ను అక్కడకు పంపారు.

  • 08 Jan 2021 10:15 AM (IST)

    అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు

    బోయిన్‌‌పల్లి ప్రవీణ్‌రావు కిడ్నాప్‌ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని జైలు అధికారులు చెబుతున్నారు.

  • 08 Jan 2021 10:07 AM (IST)

    పోలీసులకు చిక్కకుండా టోల్‌ప్లాజాలు లేని సర్వీస్‌ రోడ్లపై బెంగుళూరుకు భార్గవ్ రామ్.!

    బోయిన్‌ పల్లి ప్రవీణ్ రావు కిడ్నాప్‌ వ్యవహారం గంటగంటకు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్‌ కోసం పోలీస్ వేట కొనసాగుతోంది. భార్గవ్‌ బెంగళూరులో ఉన్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు సమాచారం సేకరించారు. పోలీసులకు దొరక్కుండా టోల్‌ప్లాజాలు లేని సర్వీస్‌ రోడ్లను ఎంచుకుని బెంగళూరు వైపు పారిపోయారని సమాచారం అందడంతో ఆదిశగా ముందుకు సాగుతున్నారు పోలీసులు.

Published On - Jan 08,2021 6:53 PM

Follow us
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా