బయోడైవర్శిటీ కేస్: ఫ్లైఓవర్ బాగోపోతే.. నా తప్పు ఎలా అవుతుంది..?

గచ్చిబౌలిలోని బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం.. అందర్నీ ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. సాధారణంగా.. రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి కానీ.. ఈ రోడ్డు రకమైన యాక్సిడెంట్‌‌లు మాత్రం చాలా అరుదు. డిఫెరెంట్‌గా.. ఫ్లైఓవర్‌ మీద నుంచి కిందకు పడటంతో.. నగర వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీంతో.. ఫ్లైఓవర్స్ కింద నుంచి వెళ్లాలంటే.. అప్పటి నుంచీ ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. అయితే.. ఈ కేసులో.. కృష్ణ […]

బయోడైవర్శిటీ కేస్: ఫ్లైఓవర్ బాగోపోతే.. నా తప్పు ఎలా అవుతుంది..?
Follow us

| Edited By:

Updated on: Dec 11, 2019 | 3:57 PM

గచ్చిబౌలిలోని బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం.. అందర్నీ ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. సాధారణంగా.. రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి కానీ.. ఈ రోడ్డు రకమైన యాక్సిడెంట్‌‌లు మాత్రం చాలా అరుదు. డిఫెరెంట్‌గా.. ఫ్లైఓవర్‌ మీద నుంచి కిందకు పడటంతో.. నగర వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీంతో.. ఫ్లైఓవర్స్ కింద నుంచి వెళ్లాలంటే.. అప్పటి నుంచీ ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది.

అయితే.. ఈ కేసులో.. కృష్ణ మిలాన్‌ రావు అనే వ్యక్తిని.. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. అతను హైక్టోర్టును ఆశ్రయించారు. ఫ్లైఓవర్‌ డైజైన్‌ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నేరం తనది కాదంటూ.. నిందితుడి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కాగా.. నిబంధనలకు మించి కారు వేగంగా నడిపినందుకు.. ఇతనిపై అధికారులు రూ.వెయ్యి జరిమానా విధించారు.

దీంతో.. హైకోర్టు.. ఈ నెల 12వ తేదీ రోజున వాదనలు ముగిసే వరకూ.. అతన్ని అరెస్ట్ చేయవద్దంటూ.. తీర్పునిచ్చింది. కానీ.. పోలీసులు మాత్రం… అతని అతి వేగం కారణంగా ఓ మహిళ మృతి చెందిందని.. అందుకు అతన్ని అరెస్ట్ చేయాలని పోలీసులు కోరారు. కాగా.. నవంబర్ 23వ తేదీన.. బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌పై.. ఓవర్‌ స్పీడ్‌తో కృష్ణ మిలార్‌ రావు రోడ్ యాక్సిడెంట్ చేశాడు.