Breaking News
  • డా.వసంత్‌కు డీఎంహెచ్‌వోలో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు. గాంధీలో సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ వసంత్‌. తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని హెల్త్‌ డైరెక్టర్‌ను కలిసిన వసంత్‌.
  • మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన మహిళ. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు. తన భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడంలేదని ఆవేదన. మంత్రి నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి.
  • రేపు ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు. మండలిని రద్దు చేయొద్దంటూ ఢిల్లీ పెద్దలను కలవనున్న ఎమ్మెల్సీలు. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎమ్మెల్సీలు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న టీడీపీ బృందం.
  • సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌.
  • బెంగాల్‌ సర్కార్ సంచలన నిర్ణయం. ఎన్నికల వ్యూహకర్త పీకేకు జెడ్‌కేటగిరీ భద్రత. తృణమూల్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్న పీకే.
  • అనంతపురం: ఏసీబీ అధికారి అవతారం ఎత్తిన కేటుగాడు. ఏసీబీ అధికారి నుంటూ పలువురు నుంచి భారీగా వసూళ్లు. ఇప్పటి వరకు పలువురు అధికారుల నుంచి రూ.27 లక్షలు వసూలు. చివరకు పోలీసులకు చిక్కిన కేటుగాడు జయకృష్ణ. రూ.2.91 లక్షలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.

గులాబీ గెలుపు నల్లేరు మీద నడకేనా..?

Huzurnagar bypoll: TRS to win for sure?, గులాబీ గెలుపు నల్లేరు మీద నడకేనా..?

హుజూర్ నగర్ బైపోల్ : హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిన అంశం. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక ఏర్పడింది. అయితే ఇక్కడ గెలుపు ఎవరిని వరిస్తోందనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గత మూడు పర్యాయాలుగా కాంగ్రెస్ వశం చేసుకుంటుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది అందని ద్రాక్షగా మిగిలింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి హుజూర్‌నగర్‌ను దక్కించుకోవాలన్న నిశ్చయంతో పక్కా ప్లాన్లు వేసింది టీఆర్ఎస్. అయితే

నామినేషన్ల పర్వం వరకు గెలుపు ద్విముఖ పోరు అనుకున్నా.. వాస్తవాలు చూస్తే హుజూర్‌నగర్‌ సీటు ఈ సారి టీఆర్ఎస్ కోటాలో చేరినట్లే అనిపిస్తోంది. అవసరం ఉన్నప్పుడు ఓ అడుగు దిగాలన్నది రాజకీయ చతురత. ఆ రాజకీయ చతురతను పక్కా ఉపయోగించింది టీఆర్ఎస్ పార్టీ. హుజూర్‌నగర్‌లో గెలుపు అంత ఈజీ కాదు అనుకున్న టీఆర్ఎస్ పార్టీ ఆచి తూచి అడుగులు వేసింది. ఇప్పటి వరకు ఒంటరిగా పోటీ దిగిన టీఆర్ఎస్ అనూహ్యంగా సీపీఐతో పొత్తుపెట్టుకుంది. ఇదే టీఆర్ఎస్ గెలుపుకు నాంధి పలకనుంది. దీనికి కారణం ఇదే సీపీఐ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మద్దతు పలికింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలకు మంచి ఓటు బ్యాంకు ఉంది. అయితే ఆ ఓటు బ్యాంకు ఇప్పుడు టీఆర్ఎస్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇక సమీకరణాలు చూస్తే.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా శానంపూడి సైదిరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపింది. అప్పుడు కాంగ్రెస్‌పై కేవలం ఏడు వేల ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే అప్పుడు కాంగ్రెస్ మహాకూటమి నుంచి పోటీ చేసింది. కాంగ్రెస్‌కు మద్దతుగా టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీలు మద్దతునిచ్చాయి. అయితే ఈ సారి కాంగ్రెస్‌కు అప్పటి మిత్రపక్షాలు ఇప్పుడు దూరమయ్యాయి. టీడీపీ బరిలోకి దిగడం.. సీపీఐ టీఆర్ఎస్ పక్కన చేరడం కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది. ఇక టీజేఎస్ మద్దతు తెల్పినా.. ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. ఇక అప్పుడు బీజేపీ నామమాత్రంగా పోటీ ఇచ్చినా.. ఈ సారి మాత్రం ఓటు బ్యాంకు పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అటు టీడీపీ కూడా ఒంటరిగా బరిలోకి దిగి.. రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునేందుకు గట్టిపోటీ ఇచ్చేందుకే ప్రయత్నాలు చేస్తోంది.

ఈ అంశాలన్నీ టీఆర్ఎస్‌కు అనుకూలంగా మారగా.. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతికూలంగా మారాయి. అంతేకాదు.. హుజూర్‌నగర్ నియోజకవర్గం ఏపీ బార్డర్లో ఉండటం.. కాస్త సెంటిమెంట్ కూడా ఇక్కడ వర్క్‌అవుట్ అవుతుంది. అయితే ఈ ఓట్లన్నీ ఇప్పుడు టీడీపీ కొంచెం బ్రేక్ చేసే అవకాశం ఉంది. అయితే తాజాగా వైసీపీ కూడా టీఆర్ఎస్‌కే మద్దతు తెల్పడంతో ఈ ఓట్లు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకే పడే అవకాశం ఉంది. ఈ సమీకరణాల దృష్ట్యా హుజూర్‌నగర్ సీటు కూడా అధికార పార్టీలో చేరేలా ఉంది.