టి.కాంగ్రెస్ లో తీరు మారని నేతలు : అధ్యక్షుల మధ్య అమీ తుమీ

Internal War In Telangana Congress, టి.కాంగ్రెస్ లో తీరు మారని నేతలు : అధ్యక్షుల మధ్య అమీ తుమీ
 తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కూడా నేతలు ఒక్క తాటి పైకి రాలేకపోతున్నారు. ఎవరి నిర్ణయాలు వారే తీసుకుంటూ..తమకి నచ్చినట్టు నడుచుకుంటూ..మళ్లీ దానికి కాంగ్రెస్ అంటే ఇన్నర్‌గా సమస్యలు కామన్ అని కబుర్లు చెప్తున్నారు.
హుజూర్ నగర్ అభ్యర్ధి విషయంలో విభేదాలు:
తాజాగా ఈ విభేదాలు మరింత ముదిరాయి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి భువనగిరి ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ జిల్లా విషయంలో పక్క జిల్లా నాయకుల సలహాలు అవసరం లేదన్నారు. ఈ మధ్యే పార్టీలోకి వచ్చిన వాళ్ల సలహాలు అంతకంటే అవసరం లేదని వ్యాఖ్యానించారు. హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

హుజూర్ నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఎంపీ రేవంత్ రెడ్డి..ఉత్తమ్ ఇతర నాయకులతో సంప్రదించకుండా తనకు నచ్చినవాళ్లని నిలబెట్టుకుంటే ఎలాగని ప్రశ్నించారు. హుజూర్‌ నగర్‌ అభ్యర్థిగా స్థానికులైన శ్యామల కిరణ్‌రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు హుజూర్ నగర్ స్థానానికి తన భార్యను అభ్యర్థిగా ప్రకటించినందుకు ఉత్తమ్‌పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జ్ కుంతియాకు రేవంత్  పిర్యాదు చేశారు.  దీంతో అగ్గి రాజుకుంది. హుజూర్‌ నగర్‌కు పద్మావతి అయితేనే సరైన అభ్యర్థి అని చెప్తూ  కోమటిరెడ్డి..రేవంత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్థిగా పెట్టాలో మాకు తెలియదా? రేవంత్ రెడ్డి చెబుతున్న అభ్యర్థి పేరు నాకే కాదు.. ఆ ప్రాంత నేత, మాజీ మంత్రి జానారెడ్డికి కూడా తెలియదు. మేం 30 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నాం. మమ్మల్ని కాదని కొత్త అభ్యర్థిని పెడతారా’ అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

మరోవైపు యురేనియం పోరు లొల్లి:
ఈ విషయం ఇలా నడుస్తూనే ఉండగా…మరోవైపు  యురేనియం పోరు విషయంలో కూడా కాంగ్రెస్ నేతల మధ్య తగాదా జరుగుతోంది. పవన్‌ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వీహోచ్, ఉత్తమ్ హాజరవ్వడంపై ఆ పార్టీ నేత..మాజీ ఎమ్మెల్యే సంపత్ ఫైరయ్యారు. అంతగా ప్రజాధారణ లేని పార్టీ పిలిస్తే..జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్…రాష్ట్ర శాఖ అధ్యక్షుడి హాజరవ్వడం ఏంటని మండిపడ్డారు.
కాగా సంపత్ వ్యాఖ్యలను… వీహెచ్‌ ఖండించారు.  ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేసినా మద్దతు ఇవ్వాలని తెలిపారు. తాను చొరవ తీసుకోని పవన్ దగ్గరకు యూరేనియం సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు. సంపత్‌ వ్యాఖ్యల పట్ల బాధపడుతునన్న వీహెచ్.. త్వరలో యురేనియంపై మరో సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *