Breaking News
  • శ్రీకాకుళం: కచరాంలో తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం నిర్వాకం. రోడ్లపై గుర్రపు స్వారీ నిర్వహించిన తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం. బైక్‌పై వెళ్తున్న రాంబాబు, రమాదేవి దంపతులను గుద్దిన గుర్రం. ఆస్పత్రిలో రాంబాబు పరిస్థితి విషమం. పట్టించుకోని రిసార్ట్‌ యాజమాన్యం. రాసార్ట్‌ ఎదుట స్థానికుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం. భారీగా మోహరించిన పోలీసులు.
  • ప.గో: తణుకు మండలం దువ్వలో పిచ్చికుక్క స్వైర విహారం. పిచ్చికుక్క దాడిలో10 మందికి గాయాలు.
  • గుంటూరు: సత్తెనపల్లిలో మహిళ ఆత్మహత్యాయత్నం. చోరీ కేసు పెట్టారన్న మనస్థాపంతో నిద్రమాత్రలు మింగిన లక్ష్మీ. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కదిరి మండలం నడిమిపల్లిలో దారుణం. యువకుడు సుధాకర్‌ గొంతు కోసిన దుండగులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌. గతంలో రామాంజనేయులు భార్యను ఎత్తుకెళ్లి.. తిరిగి అప్పగించిన సుధాకర్‌. రామాంజనేయులుపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.
  • అనంతపురం: హిందూపురంలో రెచ్చిపోయిన వీధికుక్కలు. ఇద్దరు చిన్నారులపై దాడి. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారులు. ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం.
  • విజయవాడ: వంశీ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్త కమిటీ అభ్యంతరం. టీవీ9 డిబేట్‌లో వంశీ అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. పరుష పదజాలంతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అయ్యప్ప భక్తులకు వంశీ కళంకం తెచ్చారు. ఇప్పటికైనా నియమనిష్టలతో దీక్ష చేయాలి-వేణుగోపాలస్వామి.
  • హైదరాబాద్‌: అశ్వత్థామరెడ్డి నివాసానికి వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి. అశ్వత్థామరెడ్డిని పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అందరూ ముందుకు రావాలి. అశ్వత్థామరెడ్డికి ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. కార్మికుల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. సడక్‌బంద్‌ను విజయవంతం చేయాలి-ఎంపీ కోమటిరెడ్డి.

లైవ్ అప్‌డేట్స్: హుజూర్‌నగర్‌ ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఉపఎన్నికలో మొత్తం 28 మంది బరిలో నిలిచారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ హోరాహోరీగా సాగింది. మొత్తం నియోజకవర్గంలో 2,00,754 ఓట్లు పొలయ్యాయి. 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కిపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్‌లో సుమారు 9 వేల ఓట్లను లెక్కించనున్నారు. బుధవారం కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారులు పరిశీలించారు.

నేరేడుచర్ల నుంచి..
ఓట్ల లెక్కింపు నేరేడుచర్ల మండలం నుంచి ప్రారంభమై వరుసగా పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్‌నగర్‌ మండలం, పట్టణం, గరిడేపల్లి మండలంలోని లెక్కింపుతో పూర్తవుతుంది. లెక్కింపు అంతా పూర్తయ్యాక వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు. కాగా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్ స్థానమవ్వడంతో.. ఆ పార్టీకి ఈ ఫలితం ఎంతో కీలకం. మరోవైపు గెలుపు తమదేనంటూ స్పష్టం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. దీంతో రిజల్ట్స్‌పై జోరుగా బెట్టింగులు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Picture

హుజూర్ నగర్‌ గులాబీ బాస్‌దే..

42,484 ఓట్ల తేడాతో సైదిరెడ్డి ఘన విజయం సాధించారు.

24/10/2019,2:39PM
Picture

హుజూర్ నగర్‌ గులాబీ బాస్‌దే..

15వ రౌండ్‌లో అత్యధిక ఓట్లతో సైదిరెడ్డి రికార్డు సృష్టించారు.

24/10/2019,2:38PM
Picture

హుజూర్ నగర్‌ గులాబీ బాస్‌దే..

ఎన్నికల కౌంటింగ్‌లో మొదటి నుంచీ.. టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది.

24/10/2019,2:38PM
Picture

హుజూర్ నగర్‌ గులాబీ బాస్‌దే..

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైది రెడ్డి ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు.

24/10/2019,2:37PM
Picture

హుజూర్ నగర్‌ గులాబీ బాస్‌దే..

హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.

24/10/2019,2:35PM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

16వ రౌండ్ ముగిసేసరికి 32,256 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి

24/10/2019,1:07PM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హూజూర్‌నగర్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది.

24/10/2019,1:06PM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

కాగా.. బీజేపీ, టీడీపీ పార్టీలు డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు.

24/10/2019,11:56AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సుమన్ నిలిచారు.

24/10/2019,11:55AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

రెండో స్థానంలో కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ

24/10/2019,11:54AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

11వ రౌండ్ ముగిసేసరికి 21,618 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి

24/10/2019,11:54AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్‌నగర్‌లో కారు జోరుగా దూసుకెళ్తుంది.

24/10/2019,11:54AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

డిపాజిట్లు కూడా దక్కించుకోని స్థితిలో బీజేపీ, టీడీపీ పార్టీలు

24/10/2019,11:03AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్‌ నగర్‌: పదో రౌండ్ ముగిసేసరికి 20,100 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

24/10/2019,11:02AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

డిపాజిట్లు కూడా దక్కించుకోని స్థితిలో బీజేపీ, టీడీపీ పార్టీలు

24/10/2019,10:52AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి 19,200 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

24/10/2019,10:52AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్‌ నగర్‌లో కారు దూసుకెళ్తుంది..

24/10/2019,10:52AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్ నగర్ ఎన్నికల బరిలో.. సైదిరెడ్డి, పద్మావతి, కోటా రామారావు, చావా కిరణ్మయి

24/10/2019,10:44AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు

24/10/2019,10:43AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

కొనసాగుతోన్న హుజూర్ నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

24/10/2019,10:43AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్‌ నగర్‌లో కారు జోరుగా దూసుకెళ్తోంది. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి 17,400 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

24/10/2019,9:50AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్‌ నగర్‌లో కారు జోరుగా దూసుకెళ్తోంది. ఏడో రౌండ్ ముగిసేసరికి 14,300 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

24/10/2019,9:45AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్ నగర్‌లో కారు జోరు.. నాలుగో రౌండ్ ముగిసేసరికి 9,356 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

24/10/2019,9:01AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్ నగర్‌లో మూడో రౌండ్ ముగిసేసరికి 6,500 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్.

24/10/2019,8:52AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి 4వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి

24/10/2019,8:41AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్ నగర్‌లో రెండో రౌండ్ పూర్తి

24/10/2019,8:36AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

2,467 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ముందంజ

24/10/2019,8:35AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

కొనసాగుతోన్న హుజూర్ నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

24/10/2019,8:35AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్ నగర్ ఎన్నికల బరిలో.. సైదిరెడ్డి, పద్మావతి, కోటా రామారావు, చావా కిరణ్మయి

24/10/2019,8:28AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

14 లెక్కింపు టేబుళ్లు, 21 రౌండ్లలో కౌంటింగ్

24/10/2019,8:25AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు

24/10/2019,8:23AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

కొనసాగుతోన్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

24/10/2019,8:22AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

మధ్యాహ్నం 12 గంటల వరకూ.. ఎన్నికల ఫలితాలు వెల్లడి

24/10/2019,8:18AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్

24/10/2019,8:17AM
Picture

ఓట్ల లెక్కింపు షురూ..!

హుజూర్ నగర్‌లో జరిగిన ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది

24/10/2019,8:17AM