Breaking News
  • కాశ్మీర్లో ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి. అనంత్‌నాగ్ సమీపంలోని బిజ్‌బెహారా వద్ద ఘటన. సీఆర్పీఎఫ్ క్యాంపుపై గ్రనేడ్ విసిరిన ఉగ్రవాదులు. ఘటనలో ఎవరూ గాయపడలేదని సీఆర్పీఎఫ్ వెల్లడి.
  • మూడోరోజు రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి జరిగే సుకుమార సేవగా ముత్యపుపందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తాడు.
  • రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ. కోవిడ్ నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ లేదా ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయం తెలపాలని సూచన. ఈనెల 30వ తేదీ లోపు తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈనెల 30వ తేదీ తరువాత ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకోబడవని తేల్చి చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం.
  • కోవిడ్ సమయంలో ఎన్నికల నిర్వహణపై ముగిసిన అంతర్జాతీయ సదస్సు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చించుకున్న పలు దేశాల ఎన్నికల సంఘాలు. స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా సకాలంలో ఎన్నికల నిర్వహణపై చర్చ. కోవిడ్ సమయంలో ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు, అనుభవాలు, ఆలోచనలను పంచుకున్న ఎన్నికల సంఘాలు. మహమ్మారి సందర్భంగా అనుసరించాల్సిన ప్రొటోకాల్స్‌పై మేథోమధనం.
  • 2021-22 సంవత్సరానికి ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం. లోక్ సభలో ప్రకటన చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్. మద్దతు ధర తొలగించబడుతుందనే అసత్యాలు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. గోధుమలకు క్వింటాకు 50రూ పెంపు. శెనగలు క్వింటాకు 225 రు పెంపు. మసూర్ దాల్ క్వింటాకు 300రూ పెంపు. ఆవాలు క్వింటాకు 225రూ పెంపు. బార్లీ క్వింటాకు 75రూ పెంపు. కుసుమలు క్వింటాకు 112 రూ పెంపు.
  • ఈనెల 28,29న తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్ష. ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్న జేఎన్టీయూ. మొత్తం 84 పరీక్ష కేంద్రాల్లో 67 తెలంగాణ,17 ఏపీ పరీక్ష కేంద్రాల ఏర్పాటు. పరీక్ష కు హాజరుకానున్న 78970 మంది విద్యార్థులు. రెండు రోజులు రెండు సెషన్స్ లో ఎక్జాం. నేటి నుండి ఈనెల 25 హాల్ టికెట్స్ వెబ్ సైట్ లో అందుబాటు.
  • మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం . ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని పిటిషన్ లో వినతి. దర్యాప్తును నిలిపివేస్తూ కొద్ది రోజుల క్రితం తీర్పునిచ్చిన హైకోర్టు. కేసు దర్యాప్తుపై స్టే విధించడం వల్ల కీలకమైన ఆధారాలను నిందితులు నాశనం చేసే అవకాశం ఉందని పిటిషన్లో వాదన.

టీఆర్‌ఎస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక!

Congress Gear Up For Huzurnagar By-Election, టీఆర్‌ఎస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక!

తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే హాట్‌హాట్‌గా మారాయి. ఒకవైపు బడ్జెట్ విషయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య వాడీ, వేడీ చర్చ జరుగుతోంది. ఇక క్యాబినెట్‌లో చోటు దక్కించుకోలేకపోయిన అసంతృప్త నేతలను తమవైపు గుంజుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.   ఇక యురేనియం తవ్వకాలపై చెలరేగిన ఆందోళలను అసెంబ్లీలో ప్రకటన చేసి సీఎం కేసీఆర్ సర్దుమణిగేలా చేశారు.

కాగా ఇప్పుడు హుజుర్ నగర్ ఉప ఎన్నిక అందరి దృష్టి మళ్లింది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించి దూకుడు మీద ఉండగా.. టీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. సీఎం కేసీఆర్ అక్కడి నుంచి ఎవర్నీ బరిలోకి దించబోతున్నారన్న దానిపై అందరికి ఆసక్తి నెలకుంది.  కూతురు కవితకు సీఎం బీఫాం ఇవ్వనున్నారన్న టాక్ జోరందుకుంది.

తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ స్థానం నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే క్రమంలో ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు నల్గొండ ఎంపీగా కూడా విజయం సాధించారు. దాంతో ఎంపీగా కొనసాగడానికి సిద్ధమైన ఉత్తమ్.. హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది.  ఆ క్రమంలో అక్కడ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిని కాంగ్రెస్ కన్ఫార్మ్ చేసింది.

సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో మండలంలోని నక్కగూడెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఉమ్మడి మేళ్ళచెర్వు మండలానికి మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎంత కృషి చేశానో అందరికీ తెలుసునన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషికి ప్రయత్నింనట్లు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ గలీజు రాజకీయాలు చేస్తోందని అంటూ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు ఏ పని చేశారో చెప్పాలంటూ కార్యకర్తలను అడిగారు. పిల్లలు లేరు, ఆస్తులు అవసరం లేవు, నియోజకవర్గ ప్రజలే తమ బిడ్డలని అన్నారు. కుళ్లు రాజకీయాలు తనకు తెలియదని, ఉపఎన్నికలలో కాంగ్రెస్‌కు పట్టేంకట్టేలా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎంపీగా ఉన్న హుజుర్‌నగర్‌ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందు వరుసలో ఉండేలా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. కోదాడ, హుజుర్‌నగర్‌ ప్రజలకు తను రుణపడి ఉంటానని, పద్మావతిని ఉపఎన్నికల బరిలో నిలుపనున్నట్లు పేర్కొన్నారు. ఆ దిశగానే కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చి అధికార టీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు ఉత్తమ్.

ముందుగానే అభ్యర్తిని తాము జోష్‌లో ఉన్నామని సంకేతాలు పంపింది కాంగ్రెస్. అయితే అధికార పక్షమైన టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. అటు బీజేపీ కూడా తమ క్యాండిడేట్‌ను ప్రకటించలేదు.  ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూతురు, నిజామబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్ తరుఫున బరిలోకి నిలుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఆ సీటు ప్రస్టేజ్‌గా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నస్థాయిలో ఫలితాలు రాకపోవడం..సొంత కూతురు కవిత ఓడిపోవడంతో సీఎం కేసీఆర్ డిఫెన్స్‌లో పడ్డారు. అధికారంలో ఉండి హుజుర్ నగర్ స్థానం గెలుచుకోకపోతే ప్రజల్లోకి నెగటీవ్ సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే కాంగ్రెస్‌కు కంచుకోట అందులోనూ..పిసీసీ చీఫ్ స్థానంలో తన కుమార్తెను గెలిపించి సత్తా చాటాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ఓడిపోతే కూడా ఆయన భారీగానే మూల్యం చెల్లుంచుకోవాల్సి ఉంటోంది. అందుకే అభ్యర్థి ప్రకటన విషయంలో తీవ్రంగా మల్లగుల్లాలు పడుతున్నారు. మరి సీఎం కేసీఆర్ ఎముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

Related Tags