హుజూర్‌నగర్‌ బీజేపీలో పోటాపోటీ.. ఇంతకీ టికెట్ దక్కేదెవరికి ?

తెలంగాణాలో మరోసారి ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ కూడా అభ్యర్ధుల ఎంపికలో బిజీగా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి పేరును పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శానంపూడి హుజూర్‌నగర్ నుంచి గులాబీ జెండాపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ నియోజకవర్గంలో పోటీకి నిజామాబాద్ […]

హుజూర్‌నగర్‌ బీజేపీలో పోటాపోటీ.. ఇంతకీ టికెట్ దక్కేదెవరికి ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 21, 2019 | 8:03 PM

తెలంగాణాలో మరోసారి ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ కూడా అభ్యర్ధుల ఎంపికలో బిజీగా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి పేరును పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శానంపూడి హుజూర్‌నగర్ నుంచి గులాబీ జెండాపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ నియోజకవర్గంలో పోటీకి నిజామాబాద్ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమర్తె కవిత పేరు వినిపించినా పార్టీ అధ్యక్షుడు మాత్రం ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలైన సైదిరెడ్డి పేరునే ఖరారు చేయడంతో పార్టీలో చర్చనీయాంశమైంది.

మరోవైపు హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నల్గొండ ఎంపీగా గెలుపొందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్ధిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మవతిరెడ్డి పేరును ఖరారు చేశారు. ఆమె కూడా 2018 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.

Huzurnagar bipoll turns interesting

ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణాలో ఆధిక్యతను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న బీజేపీ కూడా తమ అభ్యర్ధి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గత డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్ధానాలకు పోటీచేసినా ఒకే ఒక్క స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆతర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్దానాల్లో విజయం సాధించి అధికార టీఆర్ఎస్,ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు షాకిచ్చింది. తాజాగా జరుగుతున్న హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో కూడా తమ అభ్యర్ధిని పోటీకి దించి తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించగా బీజేపీ మాత్రం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో గతం లో ఇదే స్దానం నుంచి పోటీచేసిన భాగ్య రెడ్డి, వృత్తి రీత్యా వైద్యుడైన కోట రామారావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అదే సమయంలో మైక్ టీవీ అధినేత అప్పి రెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నారు. అయితే అప్పిరెడ్డికి బీజేపీలో సభ్యత్వం లేకపోవడం మైనస్‌గా మారింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇచ్చే విషయంలో కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Huzurnagar bipoll turns interesting