ఆరునెలల గర్భిణికి నిప్పు పెట్టిన భర్త..!

, ఆరునెలల గర్భిణికి నిప్పు పెట్టిన భర్త..!

చిన్నపాటి క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానంతో గర్భిణీ అని కూడా చూడకుండా పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు భర్త నంబియార్. విజయవాడ కృష్ణలంకలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. శైలజ కృష్ణలంకలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. భర్త నంబియార్ గుడివాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. అనుమానంతో ఎప్పుడూ ఇంట్లో గొడవ పెట్టుకునేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *