శాడిస్ట్‌ మొగుడుః కళ్లలో కారం కొట్టి, ఇస్త్రీ పెట్టెతో వాతలు

ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చట్టాలు కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నాయి. అయిన్నప్పటికీ మహిళలపై జరుగుతున్న దారుణాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. అనంతపురం జిల్లాలో ఓ శాడిస్ట్‌ మొగుడు భార్యపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. భార్య కళ్లలో కారం కొట్టి.. ఇస్త్రీపెట్టెతో దారుణంగా హింసించాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించిన బంధువులు చికిత్స అందజేస్తున్నారు. ఈ శాడిస్ట్‌ భర్త భాగోతం మూడురోజుల క్రితం జల్లాలోని నల్లచెరువు మండలంలో చోటుచేసుకుంది. ఓరువాయి గ్రామానికి చెందిన […]

శాడిస్ట్‌ మొగుడుః కళ్లలో కారం కొట్టి, ఇస్త్రీ పెట్టెతో వాతలు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 8:01 PM

ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చట్టాలు కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నాయి. అయిన్నప్పటికీ మహిళలపై జరుగుతున్న దారుణాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. అనంతపురం జిల్లాలో ఓ శాడిస్ట్‌ మొగుడు భార్యపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. భార్య కళ్లలో కారం కొట్టి.. ఇస్త్రీపెట్టెతో దారుణంగా హింసించాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించిన బంధువులు చికిత్స అందజేస్తున్నారు. ఈ శాడిస్ట్‌ భర్త భాగోతం మూడురోజుల క్రితం జల్లాలోని నల్లచెరువు మండలంలో చోటుచేసుకుంది. ఓరువాయి గ్రామానికి చెందిన రేణుకకు.. కడప జిల్లా చీకటివాండ్లపల్లికి చెందిన చంద్రతో 8ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరు సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో కుటుంబకలహాల కారణంగా రేణుక.. గత మూడేళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. నాలుగురోజుల క్రితం తన కుమారుడి ఆధార్‌ కార్డు కోసం రేణుక.. చంద్ర దగ్గరకి వెళ్లింది. రేణుకను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన చంద్ర.. ఆమెపై దాడికి ఒడిగట్టాడు. నోట్లో గుడ్డను కుక్కి.. కళ్లలో కారం కొట్టి ఐరన్‌ బాక్స్‌తో గాయపర్చాడు. తమ బిడ్డపై ఇంత దారుణానికి తెగబడ్డ చంద్రపై చర్యలు తీసుకోవాలని బాధితకుటుంబీకులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఇటువంటి శాడిస్ట్‌ భర్తలకు సరైన శిక్షలు విధించాలని మహిళా సంఘాలు సైతం డిమాండ్‌ చేస్తున్నాయి.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం