మెహబూబా పార్టీకి ముగ్గురు నేతల గుడ్ బై

జమ్మూ కాశ్మీర్ లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముప్తి కి అప్పుడే ‘అసమ్మతి సెగ’ తగిలింది. ఈ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు… టీ.ఎస్.బాజ్వా, వేద్ మహాజన్, హుసేన్ వఫా రాజీనామా చేశారు. మెహబూబా చర్యలు, ఆమె  వ్యాఖ్యలుతమను బాధించాయని, అవి దేశభక్తి సెంటిమెంట్లకు హాని కలిగించేవిగా ఉన్నాయని వారు తమ రాజీనామా లేఖల్లో పేర్కొన్నారు. దేశ జాతీయ పతాకాన్ని అవమానపరుస్తున్నట్టుగా మెహబూబా ముప్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇదివరకటి జమ్మూ […]

  • Umakanth Rao
  • Publish Date - 6:08 pm, Mon, 26 October 20

జమ్మూ కాశ్మీర్ లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముప్తి కి అప్పుడే ‘అసమ్మతి సెగ’ తగిలింది. ఈ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు… టీ.ఎస్.బాజ్వా, వేద్ మహాజన్, హుసేన్ వఫా రాజీనామా చేశారు. మెహబూబా చర్యలు, ఆమె  వ్యాఖ్యలుతమను బాధించాయని, అవి దేశభక్తి సెంటిమెంట్లకు హాని కలిగించేవిగా ఉన్నాయని వారు తమ రాజీనామా లేఖల్లో పేర్కొన్నారు. దేశ జాతీయ పతాకాన్ని అవమానపరుస్తున్నట్టుగా మెహబూబా ముప్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇదివరకటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక పతాకాన్ని ఎగురవేసేంత వరకు తాను దేశ జాతీయ పతాకాన్ని ఎగురవేయబోనని, ఎన్నికల్లో కూడా పోటీ చేయనని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో శ్రీనగర్లో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.