రోడ్డు పక్కగా తాబేళ్లు..దొరికినోళ్లకు దొరికినన్ని..

గుర్తు తెలియని వ్యక్తులు వందల కొద్ది తాబేళ్లను రోడ్డుపక్కన వదిలి వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనే గుర్తుతెలియని కొందరు వ్యక్తులు తాబేళ్లను వదిలివెళ్లారు. ఆ ప్రాంతంలో తాబేళ్లు ఉన్నాయని గమనించిన స్థానికులు కొందరు..మిగతావారికి సమాచారం అందించారు. దీంతో తాబేళ్లను చూడడానికి జనాలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.. గుంపులుగా చేరిన జనాలు..తాబేళ్లకు సంబంధించి అక్కడెవరూ లేకపోవడంతో..వచ్చిన వారు అందిన కాడికి […]

రోడ్డు పక్కగా తాబేళ్లు..దొరికినోళ్లకు దొరికినన్ని..
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 1:26 PM

గుర్తు తెలియని వ్యక్తులు వందల కొద్ది తాబేళ్లను రోడ్డుపక్కన వదిలి వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనే గుర్తుతెలియని కొందరు వ్యక్తులు తాబేళ్లను వదిలివెళ్లారు. ఆ ప్రాంతంలో తాబేళ్లు ఉన్నాయని గమనించిన స్థానికులు కొందరు..మిగతావారికి సమాచారం అందించారు. దీంతో తాబేళ్లను చూడడానికి జనాలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.. గుంపులుగా చేరిన జనాలు..తాబేళ్లకు సంబంధించి అక్కడెవరూ లేకపోవడంతో..వచ్చిన వారు అందిన కాడికి తాబేళ్లను వారి ఇళ్లకు తీసుకువెళ్లారు. తాబేళ్ల కోసం స్థానికులు ఎగబడటంతో విషయం ఆ నోట ఈనోట పాకి మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆంధ్రా నుంచి ములకలపల్లి మీదుగా భద్రాచలం ఏరియాకు వీటిని తరలించే క్రమంలో గుట్టురట్టయినట్టు తెలుస్తోంది.

చేపల లోడుతో తాబేళ్లను తరలించే క్రమంలో అటుగా పోలీసులు రావడంతో రోడ్డు పక్కనే వాటిని పడేసినట్లు పలువురు అనుమానిస్తున్నారు. తాబేళ్ల తరలింపు..అక్రమార్కుల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. తాబేళ్లు పడివున్న ప్రాంతంలో పెద్దపెద్ద బాక్సులు, వాటిని నిల్వ ఉంచేందుకు కావాల్సిన కెమికల్ పదార్థాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ తాబేళ్లకు సాధారణంగా పెద్ద స్టార్‌ హోటల్స్‌, విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుందని, ముఖ్యంగా వీటి శరీర భాగాలను కొన్ని మందుల తయారీలో  కూడా వాడుతుంటారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పడివున్న మిగిలిన తాబేళ్లను సమీప కిన్నెరసాని రిజర్వాయర్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!