మ‌రో షాకింగ్ న్యూస్ః వంద‌ల సంఖ్య‌లో ఢిల్లీ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న ఏపీ ప్ర‌జ‌లు

ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో ఎపికి చెందిన వారు..

మ‌రో షాకింగ్ న్యూస్ః వంద‌ల సంఖ్య‌లో ఢిల్లీ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న ఏపీ ప్ర‌జ‌లు
Follow us

|

Updated on: Mar 31, 2020 | 11:32 AM

ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో ఎపికి చెందిన వారు కూడా ఉన్నారు. వారి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసి వెంటనే ప్రభుత్వానికి తెలియ చేయాలని ఎపి వైద్య ఆరోగ్య శాఖ కోరింది.
జిల్లాల వారిగా ప్రార్ధనలో పాల్గొన్న వారి సంఖ్య..
శ్రీకాకుళం జిల్లా – 0 విజయనగరం జిల్లా –  3 విశాఖపట్నం రూరల్ – 1 విశాఖపట్నం సిటీ – 41 తూర్పు గోదావరి జిల్లా – 6 పశ్చిమ గోదావరి జిల్లా – 16 రాజమండ్రి – 21 కృష్ణ జిల్లా – 16 విజయవాడ సిటీ – 27 గుంటూరు అర్బన్ – 45 గుంటూరు రూరల్ – 43 ప్రకాశం జిల్లా – 67 నెల్లూరు జిల్లా – 68 కర్నూల్ జిల్లా – 189 కడప జిల్లా – 59 అనంతపూర్ జిల్లా – 73 చిత్తూరు జిల్లా – 20 తిరుపతి – 16 మొత్తం  – 711