స్మెల్ చూస్తారా.. టంగ్ ఉందిగా..

సాధారణంగా వాసన చూడాలంటే ముక్కుతో చూస్తాం.. కానీ నాలుకతో కూడా చూడొచ్చన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే, కొందరు మాత్రమే ఇలా.. ముక్కుతో పాటు నాలుకతో వాసన చూడగలరని పేర్కొన్నారు. ఇలా కొందరు మాత్రమే నాలుకతో ఎలా వాసన చూడగలుగుతున్నారన్న విషయంపై.. శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ముక్కులో ఉండే ఘ్రాణ గ్రాహక సెన్సర్లు నాలుకపైనా ఉంటాయని, అందువల్ల వాసన తీరును గుర్తించవచ్చని తెలిపారు. ఆహార రుచితో పాటు దాని వాసనను కూడా గుర్తించే శక్తి నాలుకకు ఉందని వెల్లడించారు. ఇప్పటి వరకు రుచి, వాసన స్వతంత్ర సెన్సర్ వ్యవస్థను కలిగి ఉంటాయని భావించామని, అది తప్పని తేలిందని వివరించారు.

ఈ పరిశోధన చేపట్టడానికి అసలు కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. ఓ పన్నెండేళ్ల అబ్బాయి.. తాను తినే ఆహారాన్ని నాలుకతో రుచి చూశాకే దాని వాసన బాగుంది.. లేదు.. అన్న విషయం చెప్పాడట. దాంతో అతడి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా ప్రత్యేక కేసుగా తీసుకొని పరిశోధనలు ప్రారంభించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *