Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

నల్లమల అడవుల్లో నరబలి..

నల్లమల అడవుల్లో నరబలి పెను సంచలనం సృష్టిస్తోంది. అడవిలో ఓ ఆలయం దగ్గర క్షుద్రపూజల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. టెంపుల్‌కు అతి సమీపంలోనే ఓ వ్యక్తికి చెందిన తల, మొండెం, ఇతర శరీర భాగాలు బయటపడటం నల్లమల ఫారెస్ట్‌లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. జరిగింది నరబలా? లేక హత్యనా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం సర్వ నరసింహస్వామి ఆలయం సమీపంలో వాగులో కనబడిన ఓ డెడ్‌బాడీని కొంతమంది స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానిక రెవెన్యూ అధికారులు సమక్షంలో ఆలయం సమీపంలో తవ్వకాలు జరిపారు. నరసింహస్వామివారి ఆలయానికి అతి సమీపంలోనే గోతిలో పూడ్చిపెట్టిన తల, మొండెం వేర్వేరుగా పాతిపెట్టి ఉండటం సంచలనం రేపుతోంది.

అయితే గోతిలో పాతిపెట్టిన తలకు, మొండెంకు సంబంధం కూడా లేదని పోలీసులు చెబుతున్నారు. తల, మొండెం రెండూ వేర్వేరు వ్యక్తులకు సంబంధించినవిగా ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు, డెడ్‌బాడీతో పాటు గోతిలో నిమ్మకాయలు కూడా బయటపడ్డాయి. ఎవరో క్షుద్రపూజలు చేసి ఇద్దరు వ్యక్తులను ఇక్కడ నరబలిగా ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేదంటే గుప్తనిధుల కోసమే ఈ పనిచేసి ఉంటారని రెవెన్యూ అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. గోతిలో పూడ్చిపెట్టిన డెడ్‌బాడీని పోలీసులు బయటకు తీయించారు. అయితే బయటపడ్డ తల, మొండెం వేర్వేరు వ్యక్తులకు సంబంధించినవిగా కన్పిస్తున్నాయని పోలీసులు భావిస్తున్నారు. డెడ్‌బాడీని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిస్తామన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డెడ్‌బాడీ ఎవరనేది తేలుతుందని ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తామని.. త్వరలోనే అన్ని విషయాలు బయటపడతాయన్నారు ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి.