Watch Video: ప్రాంక్ చేయాలనుకున్నారు.. బైక్‌పై అర్ధనగ్నంగా స్నానం చేశారు.. సీన్ కట్ చేస్తే..

ఒకప్పుడు ప్రాంక్ అంటే నలుగురిని నవ్వించడానికి ఉపయోగపడేది.. కాని ఇప్పుడు అదే నలుగురిని ఇబ్బంది పెడుతోంది. ఈ మధ్యకాలంలో..

Watch Video: ప్రాంక్ చేయాలనుకున్నారు.. బైక్‌పై అర్ధనగ్నంగా స్నానం చేశారు.. సీన్ కట్ చేస్తే..
Viral Video
Follow us

|

Updated on: Nov 05, 2022 | 9:20 PM

ఒకప్పుడు ప్రాంక్ అంటే నలుగురిని నవ్వించడానికి ఉపయోగపడేది.. కాని ఇప్పుడు అదే నలుగురిని ఇబ్బంది పెడుతోంది. ఈ మధ్యకాలంలో యువత ప్రాంకుల పేరుతొ వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే.. కాస్త హద్దు దాటి మరీ.. బోల్డ్ కంటెంట్‌తో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కేరళలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కేరళకి చెందిన ఇద్దరు యువకులు ప్రాంక్ పేరిట వెకిలి చేష్టలు చేశారు. వాళ్లిద్దరూ జోరు వానలో ఓ బైక్‌పై వెళ్తూ.. అర్ధనగ్నంగా స్నానం చేశారు. అంతేకాదు స్నానం చేయడానికి సోప్ కూడా ఉపయోగించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా వీరి వెకిలి చేష్టలు కంటిన్యూ కావడంతో అక్కడున్న వారంతా ఆ ఇద్దరిని వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మ్యాటర్ పోలీసుల వరకు వెళ్ళింది.

రంగంలోకి దిగిన ఖాకీలు.. ఆ యువకులు భరణిక్కవుకు చెందిన అజ్మల్, బాదుషాలుగా గుర్తించారు. అనంతరం వారిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి.. రూ. 5 వేలు జరిమానా విధించారు. కాగా, తాము ఓ ఈవెంట్ నుంచి తిరిగి ఇంటికి వస్తున్నామని.. వాన పడుతుండటంతో సరదా కోసం ప్రాంక్ చేశామని సదరు యువకులు పోలీసులకు వెల్లడించారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం..