అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టమో తెలుసా.. అందంతో పాటు అవి కచ్చితంగా ఉంటేనే అట్రాక్ట్ అవుతున్నారట..

What do Men Want in Women : ఈ లోకంలో ఎప్పటికీ మగువలంటే మగమహారాజులకు అమితమైన ప్రేమ, ఇష్టం. అందుకే చాలా మంది మహిళలను ఆరాధిస్తారు..

అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టమో తెలుసా.. అందంతో పాటు అవి కచ్చితంగా ఉంటేనే అట్రాక్ట్ అవుతున్నారట..

What do Men Want in Women : ఈ లోకంలో ఎప్పటికీ మగువలంటే మగమహారాజులకు అమితమైన ప్రేమ, ఇష్టం. అందుకే చాలా మంది మహిళలను ఆరాధిస్తారు.. అభిమానిస్తారు.. గౌరవిస్తారు.. ప్రేమిస్తారు.. అయితే అందరూ మనుషులకు ఒకేరకమైన అభిరుచి ఉండాలని రూలేమీ లేదు. ఎందుకంటే మనం తినే ఆహారం నుండి వేసుకునే డ్రస్ వరకు అన్ని విషయాల్లో మన రుచులు, అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. అయితే ఎవ్వరికీ ఎన్ని కోరికలున్నా.. మగువల విషయంలో మగవారికి రకరకాల కోరికలు ఉంటాయి.

అయితే ఎవరి మనసులో ఏముందో చెప్పడం చాలా కష్టం. ఎవరికి ఎలాంటి అలవాట్లు, లక్షణాలు, అభిరుచులు నచ్చుతాయో చెప్పలేం. అయితే ఎంత అందంగా ఉన్నా, అన్ని విషయాల్లో ఎంత కరెక్టుగా ఉన్నా, కొన్నిసార్లు పురుషులను మెప్పించలేకపోవచ్చు. దీనికి కారణం అమ్మాయిలలో కాదు. మగవారి అభిరుచులు, కోరికలు, ఆలోచనా విధానమే. అయితే మగవారు మగువలలో ఎక్కువగా ఏమి కోరుకుంటారు.. తమకు కాబోయే లైఫ్ పార్ట్ నర్ ఎలా ఉండాలని ఆశపడతారు అనే విషయంపై ఓ అధ్యయనం జరిగింది. దీని ప్రకారం పురుషులు ఎలాంటి అంశాలను అమ్మాయిల్లో ఎక్కువగా ఇష్టపడతారు.. వేటి గురించి ఎక్కువగా ఆశపడతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమ్మాయిలలో అందంతో పాటు తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారని కొందరు జనరల్ గా చెబుతున్నారు. అయితే, ఇది నిజం కాదంట.. మగవారు మగువలలో ఎక్కువగా బయటికి కనిపించే అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. మగువలలో అందంగా ఉండే వారే కాదు.. తమ కంటే ఎక్కువగా.. అంటే తనను తాను అందంగా, అద్భుతంగా ప్రజెంట్ చేసుకోగలిగే అమ్మాయిలంటే అబ్బాయిలు చాలా ఇష్టపడతాడు. ముఖ్యంగా అందంగా మాట్లాడటం, చక్కగా ముస్తాబవ్వడం, చక్కటి డ్రెస్సింగ్ సైన్స్ వీటికే అట్రాక్ట్ అవుతారు. మంచి వ్యక్తిత్వం అనేది వీరి విషయంలో అసలు మ్యాటరే కాదంట. అయితే చాలా మంది మగవారు మాత్రం అందంతో పాటు తెలివి ఎక్కువగా ఉండే వారినే ఇష్టపడతారట.

అయితే ప్రతీ దానికి తమ మీద ఆధారపడే మహిళలంటే, మగవారు ఆమడదూరం పరుగెడతారంట. ఇది ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ, మగవారు ఎక్కువగా సొంత వ్యక్తిత్వం ఉండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే వారినే ఎక్కువగా ఇష్టపడతారట. చాలా మంది పురుషులు ప్రతిదానికీ తామే ఓనర్ షిప్ కోరుకుంటూ ఉంటారు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా కొందరు పురుషులు స్త్రీలను కూడా హోమ్ ఓనర్ షిప్.. ఎందుకంటే అమ్మాయిలు కూడా ఇంటి నిర్వహణలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారట. తమ భాగస్వామి లేదా ప్రియురాలు అస్తమానం కోపంగా ఉండటం. చీటికి మాటికి అలగడం చేస్తే.. మగవారికి అస్సలు ఇష్టముండదట. ఎలాంటి పరిస్థితులు అయినా కూర్చుని మాట్లాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారట. దీని వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు తొలగిపోతాయని నమ్ముతారు.

విశాఖ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.. అసలు నిందితుడు ఎవరో కాదు..

న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక నిజాలు.. రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు బిట్టు శ్రీను ఏం చెప్పాడో తెలిస్తే షాక్..

Click on your DTH Provider to Add TV9 Telugu