Marriage: 9 మందిని పెళ్లి చేసుకున్నాడు.. విడాకుల భయంతో వరుసగా ప్రెగ్నెంట్‌లను చేశాడు.. కట్ చేస్తే..

‘వద్దురా సోదరా పెళ్లంటే నూరెళ్ల మంటరా’ అని మన్మధుడు సినిమాలో పాట పెళ్లి అయిన వారి నోట ఎప్పటికీ నానుతూనే ఉంటుంది. కారణం.. పెళ్లి అనేది జీవితం అతిపెద్ద మిస్టేక్‌గా భావిస్తుంటారు. అయితే, సరదాగా మాత్రమే. ఇక కొందరు పెళ్లి గురించి పెద్ద పెద్ద కలలు కంటుంటారు. పెళ్లి చేసుకోవడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు

Marriage: 9 మందిని పెళ్లి చేసుకున్నాడు.. విడాకుల భయంతో వరుసగా ప్రెగ్నెంట్‌లను చేశాడు.. కట్ చేస్తే..
Big Family
Follow us

|

Updated on: Mar 31, 2023 | 6:44 AM

‘వద్దురా సోదరా పెళ్లంటే నూరెళ్ల మంటరా’ అని మన్మధుడు సినిమాలో పాట పెళ్లి అయిన వారి నోట ఎప్పటికీ నానుతూనే ఉంటుంది. కారణం.. పెళ్లి అనేది జీవితం అతిపెద్ద మిస్టేక్‌గా భావిస్తుంటారు. అయితే, సరదాగా మాత్రమే. ఇక కొందరు పెళ్లి గురించి పెద్ద పెద్ద కలలు కంటుంటారు. పెళ్లి చేసుకోవడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. ఏదో కొందరు వ్యక్తులు అన్నట్లు పెళ్లి జీవితం అలా ఉండదని, అందరినీ సంతోషంగా చూసుకోవచ్చని అంటుంటారు. ఇంకేముంది.. అనుకున్నట్లుగానే పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత జీవితం ఎలా ఉంటుందో ప్రతీ వివాహితుడికి తెలిసిందే.

అయితే, ఒక్క పెళ్లికే జనాలు ఆగం ఆగం అవుతుంటే.. ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 9 మందిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిళ్లు చేసుకోవడమే లక్ష్యం అన్నట్లుగా.. ఒకరి తరువాత ఒకరిని మొత్తం తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత అసలు సినిమా కనిపించింది అతనికి. ఈ క్రమంలోనే నలుగురు భార్యలు అతనికి విడాకులు ఇచ్చారు. దెబ్బకు బెదిరిపోయిన అతను.. మిగతావాళ్లు ఎక్కడ విడాకులు ఇస్తారో అని భయపడి.. అందరినీ ప్రెగ్నెంట్‌లను చేశాడు. అలా చేస్తే వారంతా తనను విడిచిపోరని భావించారు. మరి ఈ ఘనుడు ఎవరు? అతని జీవితం ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అమెరికాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఆర్థర్(37) 2021లో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, అతను వేరే అమ్మాయిలతోనూ వ్యవహారాలు నడిపేవాడు. అందుకు అతని భార్య సహకారం కూడా ఉండేది. ఈ క్రమంలోనే ఆర్థర్ ఒకరి తరువాత మరొకరుగా మొత్తం 9 మందిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది. అదే సంవత్సరంలో నలుగురు భార్యలు విడాకులు ఇచ్చారు. దాంతో ఆర్థర్ బెదిరిపోయాడు. మిగతా భార్యలు కూడా ఎక్కడ విడాకులు ఇస్తారో అని, తానెక్కడ ఒంటరి అయిపోతానోనని బెదిరిపోయాడు. ఈ క్రమంలోనే.. అందరినీ ఒకేసారి గర్భవతులను చేయాలని ప్లాన్ చేశాడు. ఇంకేముంది.. కొందరికి సరోగసి ద్వారా గర్భవతులను చేస్తే మరికొందరిని సహజంగా ప్రెగ్నెన్సీకి కారణం అయ్యాడు.

ఇవి కూడా చదవండి

తన భార్యలకు పిల్లలు పుడితే వారు బిజీ అయిపోతారని, విడాకులు ఇవ్వాలనే ఆలోచనే వారికి రాదని ఆర్థర్ భావించాడు. అయితే, ఈ మొత్తం ప్లాన్ కోసం దాదాపు రూ. 33 లక్షలు ఖర్చు చేశాడు ఆర్థర్. డబ్బు ఖర్చు అయినందుకు అతను ఇబ్బంది పడటం లేదని, కుటుంబాన్ని పెంచుకోవడంపైనే తన దృష్టి ఉందన్నాడు ఆర్థర్. అంతేకాదండోయ్.. మళ్లీ మరికొంతమందిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు మన నిత్యపెళ్లికొడుకు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..