Surrogacy Children: ప్రేమా..పిచ్చా.. వామ్మో దీనిని ఏమంటారు.. ఏకంగా వందమంది పిల్లల కోసం ప్రయత్నాలు.. ఇప్పటికే 21 మంది

KVD Varma

KVD Varma |

Updated on: Jun 09, 2021 | 4:01 PM

Surrogacy Children: పిల్లలంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, పిల్లలంటే పిచ్చి మాత్రం కొందరికే ఉంటుంది. అయితే, మరీ ఇంత ఉండదు. ఆ దంపతులకు పిల్లలంటే పిచ్చి. ఎంతంటే అవకాశం ఉంటె ఓ వందమందిని కనేసి పెంచేసుకోవాలన్నంత.

Surrogacy Children: ప్రేమా..పిచ్చా.. వామ్మో దీనిని ఏమంటారు.. ఏకంగా వందమంది పిల్లల కోసం ప్రయత్నాలు.. ఇప్పటికే 21 మంది
Surrogacy Children

Surrogacy Children: పిల్లలంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, పిల్లలంటే పిచ్చి మాత్రం కొందరికే ఉంటుంది. అయితే, మరీ ఇంత ఉండదు. ఆ దంపతులకు పిల్లలంటే పిచ్చి. ఎంతంటే అవకాశం ఉంటె ఓ వందమందిని కనేసి పెంచేసుకోవాలన్నంత. కానీ, సాధ్యం కాదుకదా. అందుకే వారు సరోగసీ (అద్దె గర్భం)ని ఆశ్రయించారు. అలా ఇప్పటికే 20 మంది పిల్లలను కనేశారు. వినడానికి ఆశ్చర్యంగానే కాదు.. విన్నవాళ్ళకు పిచ్చి ఎక్కించే లాంటి విషయం ఇది. ఎందుకంటే, ఓ ఇద్దరు ముగ్గురు పిల్లలనే పెంచలేక అవస్థలు పడుతున్న ఈరోజుల్లో ఇప్పటికే 20 మంది పిల్లలను పెంచుతూ.. ఇంకో 80 మందిని పెంచాలని అనుకుంటున్న వారిని చూస్తె మరి పిచ్చెక్కదాండీ..

సరిగ్గా 12 నెలల క్రితం ఈ రోజు, క్రిస్టినా (28) కేవలం ఒక కుమార్తెకు తల్లి. కానీ ఇప్పుడు ఆమె 21 మందికి తల్లి. ఆమెకు సర్రోగసీ ద్వారా 20 మంది పిల్లలు కలిగారు. ప్రసవానికి మరొక మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకోవడాన్ని సరగసీ అంటారు. బటుమి (జార్జియా) లో నివసిస్తున్న క్రిస్టినా, ఆమె భర్త గలిప్ ఓజ్తుర్క్ 100 మంది పిల్లలు కావాలని కోరుకుంటారు. వ్యాపారవేత్త అయిన గలిప్ ఇందుకోసం ఎంత ఖర్చైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఇద్దరూ సర్రోగసీ కోసం సుమారు 1.5 కోట్లు ఖర్చు చేశారు. ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటానికి, అతను 16 నానీలను (ఆయా) ఇంటిలోనే ఉంచాడు. వీటి కోసం సంవత్సరంలో సుమారు 70 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. క్రిస్టినా రష్యాకు చెందినది. ఇప్పుడు వారి మూడు అంతస్థుల ఇంట్లో నాలుగు నుండి 14 నెలల వరకు పిల్లలు ఉన్నారు. క్రిస్టినాకు మొదటి వివాహం ద్వారా ఆరేళ్ల కుమార్తె విక్టోరియా కూడా ఉంది.

క్రిస్టినా తన భర్త గాలిప్‌ను జార్జియా పర్యటనలో మొదటిసారి కలిసింది. వారిద్దరూ కలిసి ఒక పెద్ద కుటుంబం గురించి కలలు కన్నారు. 2020 లో వారి ఇంటికి వచ్చిన మొదటి బిడ్డ పేరు ముస్తఫా. గల్లిప్ తన మొదటి భార్య ద్వారా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. ఒక తల్లి సాధారణంగా చేయవలసిన పనులన్నింటినీ తన పిల్లల కోసం చేస్తానని క్రిస్టినా చెప్పారు. ఆమె ఈ పిల్లలతో అన్ని సమయాలలో ఉంటుంది. వారిని జాగ్రత్తగా చూసుకునేటప్పుడు ఆమె ఎప్పుడూ విసుగు చెందదు. సాధారణంగా వారి పిల్లలు రాత్రి ఎనిమిది గంటలకు నిద్రపోతారు. ఉదయం 6 గంటలకు మేల్కొంటారు. ఎవరి పిచ్చి వారికానందం అంటే ఇదే కామోసు..

Also Read: Marriage at 95: అవును వాళ్ళిద్దరూ ఒకటయ్యారు.. నమ్ముతారా..వారి వయసు జస్ట్ 95 ఏళ్లు అంతే..!

Corona Virus: కరోనా వైరస్‌ పుట్టింది ముమ్మాటికి చైనాలోనే!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu