నమ్మించి మోసగించిన బంధువు.. సొంతింటి కోసం భిక్షాటన చేస్తున్న 85 ఏళ్ల వృద్ధురాలు

తన బంధువు నుంచి సొంతింటిని కాపాడుకోవడం కోసం ఓ వృద్ధురాలు భిక్షాటన చేస్తోంది. తనకు అవసరమైన సొమ్మును ఎవరైనా సర్దితే తిరిగి ఇచ్చేస్తానని చెబుతోంది.

నమ్మించి మోసగించిన బంధువు.. సొంతింటి కోసం భిక్షాటన చేస్తున్న 85 ఏళ్ల వృద్ధురాలు
Kadapa Old Lady
Follow us

|

Updated on: Aug 02, 2021 | 10:58 AM

అవసరం కోసమని ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆ వృద్ధురాలు లక్ష రూపాయల రుణం తీసుకుంది. ఆ డబ్బులు ఎన్ని రోజులకి తిరిగి ఇవ్వకపోవడంతో మరో వ్యక్తి ఎంటర్ అయ్యి డబ్బులు ఇచ్చేశాడు. కానీ లక్ష రూపాయలు ఇచ్చానని ఇంటిని తాకట్టు పెట్టుకొని కొన్ని రోజులకే ఇంటిని తనపై రాయించుకున్నాడు. దీంతో నిలువ నీడలేక ,తన ఇంటిని కాపాడుకోవడం కోసం కడప బస్టాండ్ ఎదురుగా భిక్షాటన చేస్తూ కన్నీరుమున్నీరుగా విలిపిస్తుంది ఆ 85 ఏళ్ల వృద్ధురాలు. ఇంతకీ ఈ వృద్ధురాలు ఎవరు? బిక్షాటన చేయడానికి కారణాలు ఏంటో? ఓ సారి చుద్దాం..

సొంత బందువే కదా అని నమ్మింది. ఆ బందువే ఇప్పుడు ఆ వృద్ధురాలని నిండా ముంచేశాడు. సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆమె ఇంటిని తాకట్టుపెట్టుకుని ఆ వృద్ధురాలికి నిలువనీడ లేకుండా చేశాడు. తన ఇంటిని దక్కించుకునేందుకు ఎనిమిది పదుల వయసుదాటిన ఆ వృద్ధురాలు భిక్షాటన చేయాల్సిన దయనీయ పరిస్థితి తలెత్తింది. కడప నగరంలో ని ఆర్టీసీ బస్టాండు వద్ద భిక్షాటన చేస్తూ కనిపించినవారికల్లా తన గోడు వినిపించింది బూరుగల రాజమ్మ (85). పాచిపనులు చేసుకుని రాజమ్మ జీవించేవారు.. ఆమెకు ఒక కూతురు…కూతురు భర్త మరణించడం తో వృద్ధురాలు వద్దనే ఉంటోంది.  1999లో డబ్బు అవసరమై సాంబయ్య అనే వ్యక్తికి తన ఇంటిని తాకట్టు పెట్టి ఒక లక్ష రూపాయలు డబ్బు తీసుకుంది. ఏడాదికే తీసుకున్న డబ్బు ఇవ్వాలని అతడు ఒత్తిడి తేవడంతో ఆమె బంధువైన రాజేంద్ర.. ఆ డబ్బు చెల్లించాడు. అయితే ఆ ఇంటిని తన దగ్గరే పెట్టుకుంటా అని చెప్పి ఆమెకు తెలియకుండా రాజేంధ్ర ఆయన పేరిట రాయించేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రాజమ్మ… దీనిపై కోర్టును ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. తర్వాత రాజేంద్ర కోర్టులో అప్పీల్ చేసుకోగా…తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. దీంతో ఆమె ఇప్పుడు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించింది.

అయితే ఈ నెలాఖరులోగా రూ.1,13,400 చెల్లిస్తే తన ఇంటిని తనకు ఇప్పిస్తానని హైకోర్టు సూచించినట్లు రాజమ్మ అంటుంది..తన దగ్గరేమో డబ్బులు లేవు, ఎవరు డబ్బులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మరోవైపు డబ్బు కట్టకపోతే ఇల్లు వదులుకోవాల్సి వస్తుందన్న ఆందోళనతో.. గత్యంతరం లేక భిక్షాటనకు దిగింది. దాతలెవరైనా తన ఇంటిని విడిపించుకునేందుకు సాయపడాలని,బిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో డబ్బు కట్టాలని నిర్ణయించుకొని కడప నగరంలో ని కొత్త బస్టాండ్ వద్ద భిక్షాటన చేస్తూ కన్నీరుమున్నీరుగా విలిపిస్తోంది. ఎవరైనా సహాయం చేస్తే ఇల్లు వచ్చాక తప్పకుండా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అని వాపోతున్నారు. తన ఇంటిని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, సోనూసూద్‌లు స్పందించాలంటూ ప్లకార్బోర్డ్ బోర్డ్ లు పట్టుకొని వేడుకుంటోంది.

(సేరి సురేష్, టీవీ9 తెలుగు, కడప జిల్లా)

Also Read..

చదివింది బీటెక్.. చేసేది లోటెక్.. 300 మంది అమ్మాయిలకు టోకరా.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు!

అమెరికాలోని సినీ థియేటర్లో 19 ఏళ్ళ టిక్ టాక్ స్టార్ కాల్చివేత.. మరొకరు కూడా..! ఆ మూవీయే కారణమా..?

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!