Beautiful Railway Stations: ప్రపంచంలోని అత్యంత అందమైన రైల్వే స్టేషన్‌ల్లు ఇవి.. మీరూ ఓ లుక్కేయండి..

Beautiful Railway Stations: ఏ ప్రయాణికులను అడిగినా రైలు ప్రయాణం అద్భుతం అనే చెబుతారు. ఎందుకంటే.. రైలు ఎక్కింది మొదలు గమ్యస్థానం చేరేంత వరకు అద్భుత అనుభూతిని ఇస్తుంది.

Beautiful Railway Stations: ప్రపంచంలోని అత్యంత అందమైన రైల్వే స్టేషన్‌ల్లు ఇవి.. మీరూ ఓ లుక్కేయండి..
Railway Stations
Follow us

|

Updated on: Nov 23, 2021 | 6:35 AM

Beautiful Railway Stations: ఏ ప్రయాణికులను అడిగినా రైలు ప్రయాణం అద్భుతం అనే చెబుతారు. ఎందుకంటే.. రైలు ఎక్కింది మొదలు గమ్యస్థానం చేరేంత వరకు అద్భుత అనుభూతిని ఇస్తుంది. రైలు ప్రయాణం ఎంతో మంది స్నేహితులను ఇస్తుంది. రైలులో వెళ్తుంటే.. ప్రకృత రమణీయ దృశ్యాలు అబ్బురపరుస్తాయి. అందుకే ట్రైన్ జర్నీని చాలామంది ఇష్టపడుతారు. అయితే, రైలు ప్రయాణం మాదిరిగానే.. ప్రపంచంలో అనేక అందమైన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్లను ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అద్భుత రైల్వే స్టేషన్లలో ప్రముఖమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఛత్రపతి శివాజీ స్టేషన్, ముంబై (భారతదేశం).. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో చే గుర్తింపు పొందింది. ఛత్రపతి శివాజీ స్టేషన్ ముంబైలో పర్యాటక ఆకర్షణకు కేంద్రంగా ఉంది. దీని నిర్మాణ అద్భుతం. సాంప్రదాయ భారతీయ అంశాలు, విక్టోరియన్ గోతిక్ శైలి సమ్మేళనంగా దీనిని అద్భుతంగా నిర్మించారు. మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని చారిత్రక స్మారక చిహ్నంగా గుర్తించింది.

గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, న్యూయార్క్ (US).. ప్రపంచంలోని అత్యంత అందమైన రైల్వే స్టేషన్లలో ఒకటిగా పరిగణించబడుతున్న గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ న్యూయార్క్ నగరంలో ఉంది. ఈ స్టేషన్‌ అందమైన బ్యూక్స్-ఆర్ట్స్ ఆర్కిటెక్చర్ కారణంగా అనేక ప్రసిద్ధ హాలీవుడ్ సినిమాలలో ప్రదర్శించబడింది. 20వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ టెర్మినల్ అద్భుతమైన పెయింటింగ్స్‌లో చూపరులను ఆకట్టుకుంటుంది.

సెయింట్ పాంక్రాస్ ఇంటర్నేషనల్ స్టేషన్, లండన్ (UK).. 1868లో ప్రారంభించబడిన ఈ అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అందాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. విక్టోరియన్ శకానికి చెందిన ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడుతుంది ఈ స్టేషన్. ఇక్కడ వాతావరణం, ఈ రైల్వే స్టేషన్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

రామ్సెస్ స్టేషన్, కైరో (ఈజిప్ట్).. కైరోలోని రామ్‌సెస్ స్టేషన్ ఈజిప్షియన్ నిర్మాణ శైలిక అద్భుతమైన ఒక నమూనా. 1950లలో ఇక్కడ ఉండే ఫారో రామ్‌సెస్ II (ఈజిప్ట్‌లోని పంతొమ్మిదవ రాజవంశం మూడవ ఫారో అయిన రామెసెస్ ది గ్రేట్ అని కూడా పిలుస్తారు) విగ్రహం పేరు మీద స్టేషన్‌కు పేరు పెట్టారు.

కౌలాలంపూర్ స్టేషన్, కౌలాలంపూర్ (మలేషియా).. కలోనియల్, స్థానిక నిర్మాణ శైలుల అందమైన సమ్మేళనం కౌలాలంపూర్ స్టేషన్. దీని ఎంట్రీ అద్భుతంగా ఉంటుంది. ఇది గాజు, ఇనుప గోపురంతో ఒక సాధారణ విక్టోరియన్ భవనం వలె కనిపిస్తుంది. కౌలాలంపూర్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన స్మారక చిహ్నం ఇది.

కనజావా స్టేషన్, ఇషికావా (జపాన్).. ఇది ఇషికావా ప్రాంతంలోని ప్రధాన స్టేషన్. ప్రతిరోజూ అనేక హై-స్పీడ్ రైళ్లకు సేవలు అందిస్తుంది. భారీ గాజు గోపురం, చెక్క గేటుతో కూడిన స్టేషన్. ఆధునిక, భవిష్యత్‌ను కలగలిపి నిర్మించిన ఈ నిర్మాణాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు.

హెల్సింకి సెంట్రల్ స్టేషన్ (ఫిన్లాండ్).. హెల్సింకిలోని ఈ స్మారక రైల్వే స్టేషన్ దాని అందమైన వాస్తుశిల్పం, ఆసక్తికరమైన చరిత్ర కలిగిన భారీ క్లాక్ టవర్‌కు ప్రసిద్ధి చెందింది. గడియారం ఒక నిమిషం ఆలస్యంగా సెట్ చేయబడింది. ఎందుకంటే.. ప్రయాణికులు సమయానికి స్టేషన్‌కు చేరుకుంటారని విశ్వాసం. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి.

Also read:

Puneet Rajkumar: నాటు నాటు పాటకు పునీత్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా ‘అప్పు’ ఫ్యాన్‌ మేడ్‌ వీడియో..

Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్

Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర.. వీడియో