Andhra Pradesh: వినాయకుడి పండగనాడు వింత.. 2 తలలతో పుట్టిన దూడ..

ఏపీలోని కడప జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ గేదెకు 2 తలలు ఉన్న దూడ జన్మించింది. అది కూడా వినాయక చవితి పర్వదినం రోజున.

Andhra Pradesh: వినాయకుడి పండగనాడు వింత.. 2 తలలతో పుట్టిన దూడ..
Rare 2 Headed Calf
Ram Naramaneni

|

Sep 01, 2022 | 12:40 PM

YSR Kadapa district: కడప జిల్లా బద్వేల్ మండలం(Badvel Mandal) బాలాయపల్లి(Balayapalli)లో వినాయకచవితి రోజున ఓ వింత చోటు చేసుకుంది. బాలాయపల్లికి చెందిన మన్నెం శంకర్ రెడ్డి అనే రైతు ఇంట్లో గేదెకు రెండు తలల దూడ పుట్టింది. వినాయక చవితి రోజున రెండు తలల దూడ పుట్టడంతో దాన్నొక అద్భుతంగా భావిస్తున్నారు.  అయితే గేదె, రెండు తలల దూడ క్షేమంగా ఉన్నాయి. వినాయక చవితి పండగ రోజున రెండు తలల దూడ జన్మించడం ఆదృష్టంగా భావిస్తున్నారు రైతు శంకర్‌రెడ్డి. వింత దూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దైవ మహిమ వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. జన్యు పరమైన సమస్యల కారణంగానే ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు. ఇలా జన్యు లోపాలతో జన్మించే జీవుల మనుగడ కష్టం అని తెలిపారు. కాగా ఇలా వింత దూడలు జన్మించిన సందర్భాల గురించి మనం అరుదుగా వింటూనే ఉంటాం. ఆ బుల్లి దూడ ఆరోగ్యం బాగుండాలని మనం కోరుకుందాం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu