సంక్రాంతి స్పెషల్ వంటలు: పండగవేళ ఈ ఐదు రకాల వంటకాలను ట్రై చేయండి.. అవి ఎంటంటే..

హిందువులు జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. సంక్రాంతిని జరుపుకోవడం అంటే కొత్త వెలుగులకు స్వాగతం పలకడం.

సంక్రాంతి స్పెషల్ వంటలు: పండగవేళ ఈ ఐదు రకాల వంటకాలను ట్రై చేయండి.. అవి ఎంటంటే..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 11:27 AM

హిందువులు జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. సంక్రాంతిని జరుపుకోవడం అంటే కొత్త వెలుగులకు స్వాగతం పలకడం. అయితే తెలంగాణలో జరుపుకునే అతి పెద్ద పండగ బతుకమ్మ, దసరా.. అలాగే ఆంధ్రప్రదేశ్‏లో జరుపుకునేది సంక్రాంతి. ఈ పర్వదినం రోజున వాకిట్లో రంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టడం ఎంత ముఖ్యంగా చేస్తామో.. అలాగే పిండి వంటలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఈ ఐదు రకాల వంటలను ట్రై చేసి చూడండి..

మురుకులు సకినాలు.. తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి రోజున చేసే సకినాలు ఎక్కువ ఫేమస్. అలాగే ఆంధ్రలో మురుకులు ఎక్కువగా చేసుకుంటారు. సంక్రాంతికి చేసే పిండివంటలలో మురుకులు, సకినాలు తప్పకుండా చేసుకుంటారు. అలాగే మీరు ఎప్పుడైన చేసుకోకపోతే ఈసారి సకినాలను ట్రైచేయండి.

పొంగళి.. ఈ సంక్రాంతికి ఇంట్లో సులభంగా చేసుకునే వంటకాల్లో ఇది ఒకటి. ఇంట్లో ఉండే బియ్యం, పెసరపప్పు, మిరియాల లేదా మిరియాల పొడి, జీలకర్ర, నెయ్యి ఉపయోగించి ఈ పొంగళిని తయారు చేస్తారు. ఇందులో గార్నిష్ కోసం బాదం, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇక తమిళనాడు రాష్ట్రంలో దీనిని ఖారా పొంగల్ అంటారు. అక్కడ సంక్రాంతికి చేసే ముఖ్యమైన వంటకం పొంగల్.

అరిసెలు.. సంక్రాంతి పండుగ రోజున చేసే పిండివంటకాల్లో అరిసెలు ముఖ్యమైనవి. నానాబెట్టిన బియ్యం, బెల్లం కలిపి అరిసెలను చేస్తారు. ఇవి వారం రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా వీటిని ఆరగిస్తారు. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి.

పూర్ణం బూరెలు.. ఆంధ్రాలో ఎక్కువగా పూర్ణం బూరెలను చేసుకుంటారు. కొబ్బరి, బెల్లం కలిపి వీటిని తయారు చేస్తారు. అంతేకాకుండా అక్కడ జరిగే శుభకార్యలలో ఈ పూర్ణం బూరెలను ఎక్కవగా వడ్డిస్తారు. వీటిని తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది.

పాయసం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పండుగకు చేసే తీపి వంటకాల్లో పాయసం ఒకటి. పాలు, చెక్కర లేదా బెల్లం కలిపి దీనిని తయారు చేస్తారు. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇక తమిళనాడులో కొన్ని రకాల పప్పులతో, కేరళలో కొబ్బరి పాలతో, తెలుగు రాష్ట్రాల్లో బియ్యంతో పాయసం తయారు చేస్తారు.

Also Read: viral video: చిన్నారి డ్యాన్స్ సూపర్.. కానీ చివరికి అలా జరగడంతో.. నెట్టింట్లో వీడియో వైరల్

New Year 2021: కొత్త సంవత్సరం కోసం సరికొత్త వంటకాలు.. ఈసారి వీటితో సంబరాలను చేసుకుందాం.