కాపాడిన వ్యక్తి కోసం 5 వేల కిలోమీటర్లు స్విమ్ చేస్తోంది.. ఈ పెంగ్విన్ కథ వింటే ఆశ్చర్యమేస్తుంది..!

Penguin Swims 5,000 Miles Every Year : తన ప్రాణాలను కాపాడినందుకు విధేయతగా ఓ పెంగ్విన్.. ప్రతి సంవత్సరం 5000 కిలోమీటర్లు ఈదుకుంటూ

కాపాడిన వ్యక్తి కోసం 5 వేల కిలోమీటర్లు స్విమ్ చేస్తోంది.. ఈ పెంగ్విన్ కథ వింటే ఆశ్చర్యమేస్తుంది..!
Penguin Swims 5,000 Miles E
Follow us

|

Updated on: Mar 15, 2021 | 8:02 PM

Penguin Swims 5,000 Miles Every Year : తన ప్రాణాలను కాపాడినందుకు విధేయతగా ఓ పెంగ్విన్.. ప్రతి సంవత్సరం 5000 కిలోమీటర్లు ఈదుకుంటూ వస్తోంది. అతడి కోసం ఎదురుచూస్తుంది. ఒక్కసారి కాపాడినందుకు తన యజమానికి విశ్వాసంగా ఉంటుంది. ఎంత సాయం చేసినా మనుషులు ఇలా విశ్వాసం చూపిస్తారా.. పైసల కోసం ప్రాణాలు తీస్తున్న రోజుల్లో ఈ పెంగ్విన్‌ను చూసి చాలా నేర్చుకోవాలి. మరి వీరిద్దరి మధ్య సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెజిల్ కు చెందిన 80ఏళ్ల డిసౌజా బ్రెజిల్ లోని జనీరో అనే ప్రాంతానికి చెందిన బీచ్ లో పార్ట్ టైమ్ చేపలు పడుతుండే వారు. అయితే 2011లో డిసౌజా స్థానికంగా ఉన్న బీచ్ లో చేపలు పట్టేందుకు వెళ్లగా అక్కడ ఒంటినిండా చమురుతో కదల్లేకుండా, ప్రాణాపాయ స్థితిలో రాళ్లమీద పడి ఉన్న ఓ పెంగ్విన్ చూశాడు. వెంటనే మనసు చలించి దానిని అక్కున చేర్చుకొని ఇంటికి తీసుకొని వచ్చి సపర్యలు చేశాడు. తినడానికి చేపలను ఆహారంగా వేశాడు. అంతేకాదు దానికి ‘డిండిమ్’ అని పేరు పెట్టి ముద్దు చేశాడు.

అలా 11 నెలలు అతనితోనే ఉన్న డిండిమ్ తర్వాత విడిచి పెట్టి వెళ్లిపోయింది. డిసౌజాను వదిలి వెళ్లిన కొంతకాలానికి సేమ్ అదే సముద్రం ఒడ్డుకి వచ్చి చేరింది. డిసౌజా కోసం ఎదురు చూసింది. అయితే ఓ రోజు ఎప్పటిలాగే చేపల వేటకోసం సముద్రానికి వచ్చిన డిసౌజాకు డిండిమ్ కనపడింది. ఒక్కసారిగా అతని దగ్గరకు వచ్చిన డిండిమ్ ఇన్ని రోజులు తన మనసులో దాచుకున్న ప్రేమను ఒక్కసారిగా కురిపించింది. అదే వాళ్లద్దరి సావాసం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పటి నుండి పెంగ్విన్ సంవత్సరంలో 8 నెలలు డిసౌజాతో గడుపుతుంది.మిగిలిన 4నెలలు మాత్రం సంతానోత్పత్తి కోసం అర్జెంటీనా మరియు చిలీ సముద్ర ప్రాంతాలకు వెళుతుంది.

తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా యశ్వంత్ సిన్హా, టీఎంసీ జాతీయ కార్యవర్గ సభ్యుడుగా కూడా నియామకం

విశాఖపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నష్టాలను పూడ్చుకునేందుకు కఠిన నిర్ణయం తప్పదన్న నిర్మలా సీతారామన్

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..