Parrot Escaped: ఈ చిలుక ఎక్కడైనా కనిపించిందా? వివరాలు చెప్పిన వారికి అదిరిపోయే బహుమతి..!

Parrot Escaped: అతను తప్పిపోయాడు.. ఆమె తప్పోపోయింది.. వారి ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తాం.. వారి వివరాలు తెలిస్తే..

  • Shiva Prajapati
  • Publish Date - 10:18 pm, Sun, 7 March 21
Parrot Escaped: ఈ చిలుక ఎక్కడైనా కనిపించిందా? వివరాలు చెప్పిన వారికి అదిరిపోయే బహుమతి..!

Parrot Escaped: అతను తప్పిపోయాడు.. ఆమె తప్పోపోయింది.. వారి ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తాం.. వారి వివరాలు తెలిస్తే చెప్పిన వారికి రివార్డ్ ఇస్తాం.. ఇలాంటి ‘మిస్సింగ్’ అడ్వర్టైజ్‌మెంట్లు ఇప్పటి వరకు మనం ఎన్నో చూసి ఉంటాం. ఇప్పుడు చెప్పబోయే ప్రకటన మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఎందకంటే.. ఈ ప్రకటన మనుషుల గురించి కాదు.. ఓ పక్షి గురించింది. కొంతమందికి పక్షులు, జంతువులంటే అమితమైన ప్రేమ. కుక్క, పిల్లి, చిలుక వంటి మూగ జీవాలను ప్రాణంగా పెంచుకుంటుంటారు. వాటిని తమ ఇంట్లో మనుషులతో సమానంగా ట్రీట్‌ చేస్తుంటారు. మరి అలా ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పక్షిలేదా జంతువు మిస్‌ అయితే ఆ బాధ మాటల్లో చెప్పలేం.

తాజాగా యూపీలోని ఓ మహిళ ఇలాంటి వేదననే అనుభవిస్తున్నారు తాను ఎంతో ప్రాణంగా పెంచుకున్న చిలుక కనిపించకుండా పోయింది. దాంతో అతను తీవ్రంగా బాధపడ్డారు. అయితే ఆ యజమాని చిలుక మిస్‌ అయింది కదా.. అని అందరిలా బాధపడుతూ వదిలేయలేదు. తన చిలుకను కనిపెట్టి తెచ్చిన వారికి రూ. 10వేల ప్రైజ్‌ మనీ ఇస్తానంటూ బంపర్‌ ఆఫర్‌‌ను ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాకు చెందిన ఓ మహిళ రెండున్నరేళ్ల కిందట ఆఫ్రికన్ చిలుకను కొనుగోలు చేసింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరికీ జంతువులు, పక్షులంటే ప్రాణం. ఆ తర్వాత చిలుకను కొనుగోలు చేసిన ఆమె తన భర్తతో కలిసి లండన్ వెళ్లిపోయింది. అప్పటి నుంచీ చిలుక బాగోగులను ఆమె కుటుంబ సభ్యులు చూసుకునేవారు. కాగా, మార్చి 2న ఆ చిలుకను లండన్‌ కు పంపించే క్రమంలోనే కనిపించకుండాపోయింది.

ఇంతకీ ఆ చిలుక ఎలా మిస్‌ అయ్యిందంటే.. సదరు యజమాని ఆ చిలుకను లండన్ పంపించేందుకు అన్ని డాక్యూమెంట్లు రెడీ చేశారు. అయితే ఆ చిలుకకు యజమానిని వదిలి ఫారెన్‌ వెళ్లడం ఇష్టం లేకనో ఏమో.. ఒక్కసారిగా కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ యాజమాని బాధకు అంతులేకుండా పోయింది. తన చిలుకను మీరే వెతికి పెట్టాలంటూ.. పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేంటంటే.. ప్రయాణానికి ముందు రోజు యజమానికి ‘ఐ లవ్ యూ’ అని కూడా చెప్పిందట.

Also read:

ప్రతిపక్షాలతో చెడుగుడు.. ఫన్ కోసం కబడ్డీ.. ఏ ఆటలోనైనా తగ్గేది లేదంటున్న ఎమ్మెల్యే రోజా.. హల్‌చల్ చేస్తోన్న వీడియో..

ODI Cricket: వన్డే చరిత్రలోనే అద్భుతం.. 43 ఫోర్లు, 14 సిక్స్‌లు.. గ్రౌండ్‌ను దడదడలాడించిన బ్యాట్స్‌మెన్..