Parenting tips: పిల్లల విషయంలో ఇలా ఎప్పుడూ ప్రవర్తించొద్దు.. తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదం ఉంది..!

Parenting tips: సాధారణంగా, ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ చదువు సహా అన్ని అంశాల్లోనూ బాగా రాణించాలని ఆకాంక్షిస్తుంటారు. దీని కోసం వారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు.

Parenting tips: పిల్లల విషయంలో ఇలా ఎప్పుడూ ప్రవర్తించొద్దు.. తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదం ఉంది..!
Parents
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 16, 2022 | 7:06 AM

Parenting tips: సాధారణంగా, ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ చదువు సహా అన్ని అంశాల్లోనూ బాగా రాణించాలని ఆకాంక్షిస్తుంటారు. దీని కోసం వారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. పిల్లకు విద్యను బోధించడంతో పాటు.. మర్యాదలు, పద్ధతులు కూడా నేర్పుతారు. వాస్తవానికి, జీవితంలో విజయం సాధించడానికి చదవడం, వ్రాయడం మాత్రమే సరిపోదని అందరికీ తెలుసు. సరైన ప్రవర్తన కూడా విజయాన్ని చేరువ చేస్తుందనేది సత్యం. ఈ కారణంగా, చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డకు మంచి ప్రవర్తనను కూడా నేర్పిస్తుంటారు. అయితే, పిల్లలు క్రమశిక్షణ కలిగి ఉండటానికి చాలా మంది తల్లిదండ్రులుచాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. మరి ఈ పద్ధతులు పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపుతున్నాయా? లేదా? అంటే ఖచ్చితంగా ప్రతికూల ప్రభావమే చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తల్లిదండ్రుల కఠిన వైఖరిని ఎదుర్కొనే పిల్లలు వారి నుంచి దూరం అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. క్రమశిక్షణ పేరుతో పిల్లలను మానసికంగా హింసించడమే కాకుండా, శారీరకంగానూ హింసించడం వంటి తప్పులు చేస్తుంటారు. అలా చేస్తే తల్లిదండ్రులకు పిల్లలు దూరం అవుతారని నిపుణులు చెబుతున్నారు. పిల్లల పట్ల కఠిన వైఖరిని అవలంభించడం వలన కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ద్వంద్వ ప్రవర్తన.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అన్ని విధాలుగా క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ, అతిథి ముందు మంచిగా నటిస్తారు. వారి ఈ ప్రవర్తన పిల్లలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. పిల్లలు మిమ్మల్ని చూసి చెడుగా భావిస్తారు. మీ నుంచి దూరమవుతుంటారు. అలాగే వారు కూడా మీ ద్వంద్వ ప్రవర్తనను అవలంబించవచ్చు. అలాంటి ప్రవర్తన వారిలో క్రమశిక్షణకు బదులు, ప్రతికూల ప్రభావం చూపుతుంది.

క్రమశిక్షణ.. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి, వారి అభిప్రాయాన్ని వినడానికి చాలా కఠినమైన నియమాలను రూపొందిస్తుంటారు. పిల్లలు క్రమశిక్షణ కోసం రూపొందించిన ఈ నియమాలను అనుసరించినప్పటికీ.. వారిలో వ్యతిరేక భావన స్థిరపడిపోతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలను తిట్టకూడదు. వారితో కఠినంగా మాట్లాడటం చేయొద్దు. పిల్లలు మీ మాటను వికపోతే దానిని ప్రేమతో వివరించడానికి ప్రయత్నించండి. క్రమశిక్షణ మంచిదే, అయితే దీని కోసం సరైన పద్ధతులను అవలంబించడం అవసరం.

బ్లాక్ మెయిల్, బెదిరింపులు వద్దు.. చాలా సార్లు తల్లిదండ్రులు తమ మాట వినడం లేదని పిల్లలను బ్లాక్‌మెయిల్ చేయడం లేదా బెదిరించడం ప్రారంభిస్తారు. భయపెట్టడం, బెదిరించడం చేస్తుంటారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తల్లితండ్రులు పదే పదే బెదిరింపులకు గురిచేయడం వల్ల పిల్లలు కలత చెంది కొన్ని తప్పటడుగులు వేస్తారు. అందుకే, తల్లిదండ్రులు తమ పిల్లలను బెదిరించకూడదు. వారి మాట వినేందుకు బ్లాక్‌మెయిల్ చేయకూడదు. ప్రేమతో పిల్లలకి వివరించడానికి ప్రయత్నించాలి.

Also read:

Migraine Relief Tips: ఈ ఐదు యోగాసనాలు మైగ్రేన్ మరియు తలనొప్పి నుండి బయటపడటానికి సహాయపడతాయి

Hair Care Tips: జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారా? ఉల్లిపాయ నూనెతో ఇలా చేయండి..

Viral Video: 71 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న బామ్మ.. ఏకంగా 11 రకాల వెహికిల్ లైసెన్స్‌లు పొందిం..