విద్యార్థులారా అలర్ట్.. NEET PG 2021 రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ స్టార్ట్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..

నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (NBE) మంగళవారం నీట్ పీజీ 2021 ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్

విద్యార్థులారా అలర్ట్.. NEET PG 2021 రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ స్టార్ట్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..
Follow us

|

Updated on: Feb 23, 2021 | 12:32 PM

నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (NBE) మంగళవారం నీట్ పీజీ 2021 ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్ పీజీ2021) కోసం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 18న జరగనుంది. నీట్ పేయింగ్ అప్లై లింక్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాగా.. మార్చి 15 చివరితేదీ. కాగా గతంలోనే ఎన్బీఈ నీట్ పీజీ 2021, నీట్ ఎండీఎస్ 2021 పరీక్ష తేదీలను విడుదల చేసింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఎన్బీఈ 2021 ఏప్రిల్ 18న నీట్ పీజీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు హజరయ్యే విద్యార్థులు ఎన్బీఈ అధికార వెబ్ సైట్ nbe.edu.inలో చూసుకోవచ్చు. అలాగే నీట్ పీజీ 2021 ఎగ్జామ్ కంప్యూటర్ ఆధారంగా జరగనుంది.

గుర్తించుకోవలసిన ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 15 నీట్ పీజీ 2021 ఎగ్జామ్ డేట్: ఏప్రిల్ 18 నీట్ పీజ్ 2021 రిజల్ట్స్: మే 31లోగా

అర్హత..

ఈ పరీక్షకు అప్లై చేయాలనుకునే అభ్యర్తులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తించబడిన ఒక సంస్థ జారీ చేసిన ఎంబీబీఎస్ డిగ్రీ (తాత్కలిక లేదా శాశ్వత) సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి. అలాగే ఎంసీఐ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. నీట్ పీజీ 2021 అభ్యర్థులు జూన్ 30న లేదా అంతకు ముందు ఒక సంవత్సరం ఇంటర్న్ షిప్ పూర్తిచేసి ఉండాలి.

నీట్ గురించి..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) దేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అలాగే డెంటల్ హస్పిటల్స్‏లో అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబీబీఎస్), డేంటల్ కోర్సులు (బీడీఎస్) చేయాలనుకునే అభ్యర్థులకు ఎంట్రన్స్ ఎగ్జామ్.

NBE గురించి..

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ )ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య పరీక్షలకు ఎంట్రన్స్.. 195లో సోసైటీ ఢిల్లీ రిజిస్ట్రేషన్ చట్టం కింద దీనిని ప్రారంభించారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. హైకోర్ట్‌ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేర్పులు.