Navalben: పాలను అమ్మి రూ.1.10 కోట్లు సంపాదించింది.. రాష్ట్రపతి సాధికారిత గుర్తింపులో మహిళ ‘నవల్‌బెన్‌’

Navalben: మీరు చేసే పని మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండి వ్యాపారం కొనసాగించుకోవచ్చు. ఈ విషయంలో గుజరాత్‌కు చెందిన 62 ఏళ్ల నవల్‌బెన్‌ దల్సాంగ్‌భాయ్‌ చౌదరి..

Navalben: పాలను అమ్మి రూ.1.10 కోట్లు సంపాదించింది..  రాష్ట్రపతి సాధికారిత గుర్తింపులో మహిళ 'నవల్‌బెన్‌'
Follow us

|

Updated on: Jan 16, 2021 | 5:43 PM

Navalben: మీరు చేసే పని మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండి వ్యాపారం కొనసాగించుకోవచ్చు. ఈ విషయంలో గుజరాత్‌కు చెందిన 62 ఏళ్ల నవల్‌బెన్‌ దల్సాంగ్‌భాయ్‌ చౌదరి చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది. గుజరాత్‌లోని బనస్‌ కాంతా జిల్లా నాగాలా గ్రామానికి చెందిన నవల్‌బెన్‌. అన్ని అసమానతలను ధిక్కరించి తన జిల్లాలో ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టి ఆదర్శంగా నిలుస్తోంది. నివేదికల ప్రకారం.. 2020లో రూ.1.10 కోట్ల పాలను అమ్మి రికార్డు సృష్టించింది. ఇలా నెలకు రూ.3.50 లక్షలు లాభం పొందగలిగింది. 2019లో ఆమె రూ.87.95 లక్షల విలువైన పాలను విక్రయించినట్లు తెలుస్తోంది. గత ఏడాది నవల్‌బెన్‌ తన ఇంట్లోనే పాల కేంద్రాన్ని స్థాపించారు. ఇప్పుడు ఆమె 80కిపైగా గేదెలు, 45 ఆవులు ఉన్నాయి. ఇవి అనేక గ్రామాల్లోని ప్రజల పాల అవసరాలను తీరుస్తున్నట్లు చెప్పారు.

నవల్‌బెన్‌ దల్సాంగ్‌భాయ్‌ మాటల్లో..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు నలుగురు కుమారులున్నారు. వారు నగరాల్లో చదువుకుంటూ, జాబ్‌ చేస్తున్నారు. కానీ నేను వాళ్లకంటే ఎక్కువ సంపాదిస్తున్నా. నేను 80 గేదెలు, 45 ఆవుల పాడిని నడుపుతున్నాను. 2019లో నేను రూ.87.95 లక్షల విలువైన పాలను విక్రయించాను. 2020లో రూ.1 కోటి 10 లక్షల పాలను అమ్మడం ద్వారా నేను జిల్లాలో మహిళల వ్యాపార అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్నాను అని సంతోషం వ్యక్తం చేసింది.

అముల్‌ డెయిరీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ట్వీట్‌

కాగా, 10 మిలియనీర్‌ గ్రామీణ మహిళ పారిశ్రామికవేత్తల జాబితాను అముల్‌ డెయిరీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆర్‌ఎస్‌ సోధి గత ఏడాది ఆగస్టు నెలలో ట్వీట్‌ చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పాడిపరిశ్రమ, పశుసంవర్ధకంలో పాల్గొన్న ఈ మహిళలు అముల్‌కు పాలు అమ్మడం ద్వారా నెలకు రూ. లక్ష అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సహకార సమాజంలో విజయవంతం కావడంలో సాధికారిత మహిళల పాత్రను రాష్ట్రపతి గుర్తంచారు.

రాష్ట్రపతి సాధికారిత గుర్తింపులో నవల్‌బెన్‌ ఉన్నారు..

కాగా, 2020లో రూ.1.10 కోట్ల పాలను అమ్మి రికార్డు సృష్టించించిన నవల్‌బెన్‌ రాష్ర్టపతి సాధికారిత గుర్తింపులో ఉన్నారు. ఈ ఏడాదిలో 221595.6 లీటర్ల పాలను అమ్మడం ద్వారా ఆమె ఆదాయంగా రూ.87,95,900.67 సంపాదించారు. మొత్తం 10 మంది మహిళల్లో ఆమె అత్యధికంగా సంపాదించింది. పైన పేర్కొన్న గుర్తింపుతో పాటు బనవల్‌బెన్‌ కాంత జిల్లాలో పాడి, వ్యవసాయ రంగంలో ఆమె సాధించిన విజయాలకు రెండు గోల్డెన్‌ అవార్డులతో పాటు మూడు ఉత్తమ పశుపాలక్‌ అవార్డులను కూడా దక్కించుకున్నారు.