యవ్వనంగా మెరిసే చర్మం కోసం సింపుల్ నేచురల్ డ్రింక్స్.. ఈ డ్రింక్స్ తో చర్మసౌందర్యం మీ సొంతం..!
మెరిసే చర్మం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఈ రోజుల్లో దీని కోసం ఖరీదైన క్రీములు వాడాల్సిన అవసరం లేదు. కొన్ని నేచురల్ డ్రింక్స్ తాగడం అలవాటు చేసుకుంటే మీ చర్మం మెరిసిపోతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి కేవలం క్రీములే కాదు.. తీసుకునే ఫుడ్, డ్రింక్స్ కూడా ముఖ్యమైనవి. ఉదయాన్నే ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.
Updated on: Feb 03, 2025 | 8:59 PM

కొబ్బరి నీరు చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడతాయి. చర్మం పొడిబారకుండా కాపాడి మృదువుగా చేస్తుంది.

దోసకాయ చర్మాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. పుదీనాలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి. ఈ జ్యూస్‌ను రోజూ ఉదయం తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని కాపాడుతుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగితే శరీరం శుభ్రమవుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచిది.

పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు పాలు ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మం వృద్ధాప్యంతో పోరాడటానికి సహాయపడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ డ్రింక్ చాలా ఉపయోగపడుతుంది.

గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ముఖ్యంగా EGCG (ఎపిగల్లోకాటెచిన్ గాలెట్) అధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

కలబంద చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తేమను కూడా పెంచుతుంది. అదే విధంగా మంటను తగ్గిస్తుంది. ఉదయాన్నే కలబంద రసం తాగితే మొటిమలు తగ్గుతాయి. చర్మాన్ని శుభ్రంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.





























