Solar Storm: భూమికి పొంచి ఉన్న సౌర తుపాను ముప్పు.. జీపీఎస్, ఇంటర్నెట్‎పై ప్రభావం చూపే అవకాశం..

అతి త్వరలో రెండు సౌర తుపాన్లు భూమిని తాకే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌర తుపాను వల్ల రేడియో కమ్యునికేషన్లు...

Solar Storm: భూమికి పొంచి ఉన్న సౌర తుపాను ముప్పు.. జీపీఎస్, ఇంటర్నెట్‎పై ప్రభావం చూపే అవకాశం..
Solar Storm
Follow us

|

Updated on: Dec 23, 2021 | 3:21 PM

అతి త్వరలో రెండు సౌర తుపాన్లు భూమిని తాకే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌర తుపాను వల్ల రేడియో కమ్యునికేషన్లు, జీపీఎస్ ఆధారిత వ్యవస్థలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇంటర్నెట్‎పై కూడా సౌర తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంతరిక్ష వాతావరణ భౌతిక శాస్త్రవేత్త డా.తమిత స్కోవ్ అంచనా వేశారు. డిసెంబర్ 20న సూర్యుడిపై సంభవించనున్న సౌర తుపాను డిసెంబర్ 23న ఉదయం 6.36 గంటలకు భూమిని తాకుతుందని నాసా వెల్లడించింది. గతంలో జీ2, జీ3 మాగ్నెటిక్‌ సౌర తుఫానులు వచ్చాయన్న డాక్టర్ తమిత చెప్పారు. తాజా సౌర తుఫానులు హై అలర్ట్ కేటగిరీలో ఉన్నాయని తెలిపారు.

సౌర తుపానులు ఎందుకు ఏర్పడతాయి?

ప్రతీ పదకొండు ఏళ్లకోసారి సూర్యుడి మాగ్నెటిక్‌ సైకిల్‌ ఓవర్‌డ్రైవ్‌ అవుతూ ఉంటుంది. ఈ సైకిల్‌ జరిగే సమయంలో సూర్యుడి అయస్కాంత ద్రువాలు మారుతూ ఉంటాయి. దీనినే సోలార్‌ మాగ్జిమమ్‌గా పిలుస్తారు. సూర్యుని అయస్కాంత క్షేత్రంలోని మార్పులు ఎక్కువ సంఖ్యలో సన్‌ స్పాట్స్‌, భారీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అయస్కాంత క్షేత్రంలోని హెచ్చుతగ్గుల వల్ల సోలార్‌ ఫ్లేర్స్ ఏర్పడతాయి. సౌర తుపాను నేపథ్యంలో జీ2 జియోమాగ్నెటిక్‌ తుఫాను భూమిపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది. జియో మాగ్నెటిక్‌ తుపానులు ఎక్కువగా కరోనల్‌ మాస్‌ ఎజక్షన్‌ వల్ల ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే సూర్యుడి కరోనల్‌ (ఉపరితలం)పై జరిగే భారీ విస్పోటనాలతో ఈ తుపానులు ఏర్పడుతాయి. ఆ శక్తి సౌర జ్వాలల రూపంలోను, ఆవేశం గల ప్లాస్మా పుంజాల రూపంలో గంటకు లక్షల మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే కోరనల్‌ మాస్‌ ఎజక్షన్స్‌ భూమిని కేవలం 15 నుంచి 18 గంటల్లో చేరే అవకాశం ఉంటుంది. తాజా సౌర తుపాను వేగం గంటకు 16 లక్షల కిలో మీటర్లను మించవచ్చని అంచనా వేస్తున్నారు.

భూమిపై ప్రభావం…

గంటకు లక్షల కిలో మీటర్ల వేగంతో దూసుకువచ్చే తుపాన్లు, సౌర గాలుల ప్రభావంతో ఉపగ్రహాల పనితీరులో మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. తుపాన్ జీపీఎస్‌, ఇంటర్నెట్‌ వ్యవస్ధపై ప్రభావం చూపనుంది. ఫోన్‌ సిగ్నళ్లు, శాటిలైట్‌ టీవీ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరగటంతో పవర్‌గ్రిడ్‌లు దెబ్బతినే ప్రమాదం ఉంది. భూ అయస్కాంత క్షేత్రంపై ప్రభావం చూపనుంది. సౌర తుపాన్‎తో భూ వాతావరణంలో మిరుమిట్లు గొలిపే ఖగోళ కాంతి దర్శనం ఇస్తుంది. ఆర్కిటిక్‌ దృవాల వద్ద ఏర్పడే అరోరా బొరియాలిస్‌ ఇతర ప్రాంతాల్లో కూడా కన్పించే అవకాశం ఉంటుంది. న్యూయర్క్‌ లాంటి ప్రాంతాల్లో అరోరా బోరియాలిస్‌ కాంతులు కన్పిస్తాయని అంచనా వేస్తున్నారు.

భారత్‌కు ముప్పు తక్కువేనా..!

భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్‌ ఉండడంతో భారత్‌ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్‌ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అట్లాంటిక్‌, ఫసిఫిక్‌ మహాసముద్రాల పరిధిలో అంతర్గత కేబుల్‌ వ్యవస్థ భారీగా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

1859, 1921లో సౌర తుపానులు భూమిని తాకాయి. 1989లో సంభవించిన తుపాన్‎తో రేడియో వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి 2011లో సౌరజ్వాలలతో సంభవించిన సౌర తుపానుతో చైనాలో రేడియో ప్రసారాలు ఆగాయి. 2024లో కూడా ఎక్కువగా సౌర తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Read Also.. Viral Photo: ఈ ఫోటోలో నక్కిన నక్కను కనిపెట్టండి చూద్దాం.. ఖచ్చితంగా సాల్వ్ చేయలేరు!

ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?
ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?
నాగకేసర పువ్వులతో ఆరోగ్యప్రయోజనాలు పుష్కలం..!ఇలా వాడితే దివ్యౌషధం
నాగకేసర పువ్వులతో ఆరోగ్యప్రయోజనాలు పుష్కలం..!ఇలా వాడితే దివ్యౌషధం
నయా శక్తిమాన్ గా రణ్‌వీర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖేష్ ఖన్నా
నయా శక్తిమాన్ గా రణ్‌వీర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖేష్ ఖన్నా
అక్కడ పూజారులే దేవుళ్లు.. తొక్కితే కష్టాలన్నీ హాంఫట్..!
అక్కడ పూజారులే దేవుళ్లు.. తొక్కితే కష్టాలన్నీ హాంఫట్..!
గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగుల జీతం ఎంత పెరగనుంది?
గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగుల జీతం ఎంత పెరగనుంది?
కంచుకోటను వదిలి.. దక్షిణాదికి కదిలి.. ఇందిర గాంధీ బాటలో మనవడు..
కంచుకోటను వదిలి.. దక్షిణాదికి కదిలి.. ఇందిర గాంధీ బాటలో మనవడు..
మంచు లక్ష్మి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని.. వీడియో
మంచు లక్ష్మి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని.. వీడియో
ఎంతమంది ఉన్న డోంట్‌ కేర్‌ అంటూ స్పీడ్ పెంచిన నిత్యా మీనన్.!
ఎంతమంది ఉన్న డోంట్‌ కేర్‌ అంటూ స్పీడ్ పెంచిన నిత్యా మీనన్.!
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
మంచిదని పిస్తాలు తెగ తింటున్నారా.? డేంజర్‌ అంటున్న నిపుణులు..
మంచిదని పిస్తాలు తెగ తింటున్నారా.? డేంజర్‌ అంటున్న నిపుణులు..
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో