Viral: ‘ఆడు మగాడ్రా బుజ్జి’.. మాజీ ప్రియురాలిపై ప్రియుడి స్వీట్ రివెంజ్.. నెటిజన్లు ఫిదా..

ఈరోజుల్లో ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని.. కొందరు 'ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం' అంటూ విరహ గీతాలు పాడుతుంటారు.

Viral: 'ఆడు మగాడ్రా బుజ్జి'.. మాజీ ప్రియురాలిపై ప్రియుడి స్వీట్ రివెంజ్.. నెటిజన్లు ఫిదా..
Viral
Follow us

|

Updated on: Nov 26, 2022 | 1:33 PM

ఈరోజుల్లో ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని.. కొందరు అబ్బాయిలు దారుణాలకు ఒడిగడుతుంటే.. మరికొందరు ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం’ అంటూ విరహ గీతాలు పాడుతుంటారు. అయితే ఇక్కడ మనోడు కొంచెం డిఫెరెంట్ లెండి.. మోసం చేసిన ప్రియురాలిపై స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాడు ఈ వ్యక్తి.. అతడి ఆలోచన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. మరి అదేంటో చూసేద్దాం పదండి..

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా కల్చపూర్ గ్రామానికి చెందిన అంతర్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం ఓ పెళ్లిలో చూసిన అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడటం.. అది కాస్తా ప్రేమగా చిగురించడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ అమ్మాయి అంతర్‌కు షాకిచ్చి.. వేరొకరితో పెళ్లికి సిద్దమవుతుంది. ‘నన్ను ఎందుకు ఇంతలా మోసం చేశావ్’ అని అంతర్ ఆమెను అడగ్గా.. ‘నీలాంటి ఉద్యోగం లేని వ్యక్తి ఎవరు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి ఉద్యోగం, ఇల్లు, ఆస్తులు ఉన్నాయి.’ అని అంతర్‌కు ఫ్యూజులు ఎగిరిపోయేలా షాకిస్తూ చెప్పిందామె.

మొదట్లో ఎంతగానో కృంగిపోయిన అంతర్.. ఆ తర్వాత చనిపోవాలని కూడా అనుకున్నాడు. కాని స్నేహితులు అతడితో వారించడం.. మోసం చేసినవారి కోసం ప్రాణాలు తీసుకోవడం మూర్ఖత్వం అని చెప్పడంతో అంతర్ చివరికి ఆ ప్రయత్నాలను విరమించుకున్నాడు. అలా రెండు సంవత్సరాల తర్వాత తన లవ్ ఫెయిల్యూర్ నుంచి కోలుకున్నాడు అంతర్. అనంతరం కల్చిపూర్ బస్టాండ్‌లో ఓ చాయ్ షాప్ ఓపెన్ చేశాడు. అది కూడా తన మాజీ ప్రియురాలి పేరు మీద పెట్టాడు. ఇక్కడ ఇంకో చిత్రమైన విషయమేంటంటే.. ఆ షాప్‌కొచ్చిన సాధారణ వ్యక్తులకు అంతర్ రూ. 10కి టీ అమ్ముతుంటే.. అతడిలా అమ్మాయిల చేతిలో మోసపోయిన భగ్న ప్రేమికులకు సగం ధరకే అంటే రూ.5కే  టీ అమ్ముతున్నాడు. తనలా ప్రియురాలి చేతిలో మోసపోయిన వారికి కాస్తయిన ఉపశమనం కలిగేందుకు ఇలా ఇస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!