Corona Effect: ఆఫీసుకు గుర్రంపై వస్తా పర్మిషన్‌ ఇవ్వండి.. కలెక్టర్ అర్జీ పెట్టుకున్న ఉద్యోగి..

Application to Collector: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గిన ఈ మాయదారి..

  • Shiva Prajapati
  • Publish Date - 9:57 pm, Sun, 7 March 21
Corona Effect: ఆఫీసుకు గుర్రంపై వస్తా పర్మిషన్‌ ఇవ్వండి.. కలెక్టర్ అర్జీ పెట్టుకున్న ఉద్యోగి..

Application to Collector: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గిన ఈ మాయదారి కరోనా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనాలపై మరోసారి దెబ్బ కొడుతోంది. దాంతో ప్రజలు మళ్లీ హడలిపోతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌లు తేలుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది. దాంతో గతేడాది పరిస్థితులే ఇప్పుడూ పునరావృతం అవుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. తమకెక్కడ కరోనా కరోనా సోకుతుందోనని భయపడిపోతున్నారు. జన సమూహాల్లో తిరగాలంటే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి జిల్లా కలెక్టర్‌ను వింత అనుమతిని కోరాడు.

అదెంటో ఇప్పుడు చూద్దాం. నాందేడ్ జిల్లా కలెక్టరేట్‌లో గ్యారెంటీ స్కీమ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు సతీష్ పంజాబ్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో అందరిలాగే తానూ భయపడిపోయాడు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు ఒక అర్జీ పెట్టుకున్నాడు. తాను పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టులో కార్యాలయానికి రావాలంటే భయం వేస్తోందని, ప్రభుత్వం అనుమతి ఇస్తే రోజూ గుర్రంపై ఆఫీస్‌కు వెళ్లి వస్తానని విజ్ఞప్తి చేశాడు. కానీ, అతని విజ్ఞప్తిని ఉన్నతాధికారులు తోసిపుచ్చారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయానికి గుర్రంపై రావడం దేశంలో ఎక్కడా లేదని, ఆ కారణంగా అనుమతి ఇవ్వడం కష్టమని అధికారులు తేల్చి చెప్పారు. మరో కారణమేంటంటే.. కార్యాలయానికి గుర్రంపై వస్తే దానిని ఎక్కడ ఉంచాలి? దాని బాగోగులు ఎవరు చూస్తారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అతని విజ్ఞప్తిని అధికారులు రిజెక్ట్ చేశారు.

ఇదిలాఉంటే.. అసలు గుర్రం గోల ఎందుకు.. కారు, బైక్‌ ఇలా దేనిపై అయినా రావచ్చు కదా అని కొందరు అంటుంటే.. దీనికి కూడా సతీష్ కొత్త సమాధానం చెప్పాడు. తాను బైక్‌పై కార్యాలయానికి వస్తే గతుకుల రోడ్ల వల్ల తన నడుం విరిగిపోతోందని, ఒళ్లు నొప్పులు ఎక్కువై పోతున్నాయి చెప్పుకొచ్చాడు. పోనీ కారు కొనుక్కుందామంటే అంత స్థోమత తనకు లేదు అని అన్నాడు. అందుకే అనుమతి ఇస్తే తాను గుర్రం కొనుక్కుని రోజు గుర్రంపై ఆఫీసుకు వస్తానని విన్నవించాడు. తాజాగా ఈ అంశం మహారాష్ట్రలోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది.

Also read:

Women’s Day 2021: మహిళా సాధికారిత కోసం మరో ముందడుగు.. ‘హెర్ సర్కిల్’ను ప్రారంభించిన నీతా అంబానీ..

Visa God Temple: విమాన దేవాలయం.. ఆ ప్రసాదం సమర్పిస్తే వీసా కన్ఫామ్‌..!

భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!