ఆ ప్రాంత రైతులు లవంగాల సాగుతో లక్షలు సంపాదిస్తున్నారు..! తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..

Cultivating Cloves: లవంగం అంటే ఎవ్వరు తెలియనివారుండరు. వంటలలో విరివిగా వాడే ఒక సుగంధ ద్రవ్యం. అంతేకాదు ఔషధాలలో ఎక్కువగా వాడుతారు.

ఆ ప్రాంత రైతులు లవంగాల సాగుతో లక్షలు సంపాదిస్తున్నారు..! తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..
Cloves

Cultivating Cloves: లవంగం అంటే ఎవ్వరు తెలియనివారుండరు. వంటలలో విరివిగా వాడే ఒక సుగంధ ద్రవ్యం. అంతేకాదు ఔషధాలలో ఎక్కువగా వాడుతారు. లవంగ మొక్క ఒక సతత హరిత మొక్క. ఈ మొక్క ఒక్కసారి నాటితే అనేక సంవత్సరాల పాటు దిగుబడిని ఇస్తుంది. మహారాష్ట్రలో లవంగాలను ఎక్కువగా పండిస్తారు. కొంకణ్ ప్రాంతంలో సాగు చేస్తారు. లవంగ నూనెను రుచికరమైన ఆహార పదార్థాలతో పాటు వివిధ రకాల పారిశ్రామిక ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. లవంగ నూనెను టూత్ పేస్ట్, పంటి నొప్పి , కడుపు వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు.

భారతదేశంలో ఉష్ణమండల, వేడిగా ఉండే ప్రాంతాలు లవంగాల సాగుకి అనుకూలంగా ఉంటాయి. పొడవైన చెట్లకు సరైన ఆరోగ్యం, బలం కోసం ఉష్ణమండల వాతావరణం అవసరం. లవంగం మొక్క ఎదుగుదలకు 10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలం. ఈ చెట్టు పెరుగుదల దశలో 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. చలి, భారీ వర్షపాతం ఉన్న ప్రదేశాలలో దీని సాగు సాధ్యం కాదు. లవంగాల సాగులో మొదటి నుంచి 4 నుంచి 5 సంవత్సరాల వరకు నీటిపారుదల అవసరం. ఈ సమయంలో లవంగాల సాగులో నిరంతర నీటిపారుదల ఉండాలి. తద్వారా నేలలో తేమ ఉంటుంది. వేసవి కాలంలో నేలలోని తేమ కోసం నీటిపారుదల చాలా ముఖ్యం.

లవంగ మొక్కకు మొదటి సంవత్సరంలో నీడ అందించాలి. లవంగ చెట్టుకు నీటిని సరఫరా చేసేటప్పుడు నేల తడి ఉండి, ఉండనట్లుగా జాగ్రత్త వహించాలి. చిత్తడినేల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ఎక్కువ నీటికి బదులు కొద్ది మొత్తంలో నీటిని అనేకసార్లు ఇవ్వాలి. నాటడానికి రెండు సంవత్సరాల మొక్కను ఉపయోగిస్తే 4 నుంచి 5 సంవత్సరాల తరువాత చెట్టు పుష్పించడం ప్రారంభమవుతుంది. రెండు సీజన్లలో పువ్వులు వస్తాయి. మొదటి అతి ముఖ్యమైన పంట ఫిబ్రవరి, మార్చి మధ్య ఉత్పత్తి అవుతుంది. సెప్టెంబర్-అక్టోబర్ నెలలో రెండో పంట వస్తుంది. కొత్త ఆకులపై లవంగ మొగ్గలు కనిపిస్తాయి. మొగ్గలు పుష్పించిన 5 నుంచి 6 నెలల్లో కోయడానికి సిద్ధంగా ఉంటాయి.

హోండా సిటీ కార్.. జీరో డౌన్ పేమెంట్.. ధర రూ.3 లక్షల కన్నా తక్కువే..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu