Sticker on Fruits: పండ్లపై చిన్న చిన్న స్టిక్కర్లు అతికించి ఉంటాయి కదా.. అవి ఎందుకో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి..

మార్కెట్‌ ఎప్పుడూ కూడా సీజనల్ పండ్లతో నిండిపోయింది. మార్కెట్‌కి వెళ్లినప్పుడు రకరకాల పండ్లపై చిన్న చిన్న పేపర్‌ స్టిక్కర్‌లు అతికించి ఉండడం అందరం గమనించే ఉంటాం. పండు మీద అలాంటి స్టిక్కర్ ఎందుకు..

Sticker on Fruits: పండ్లపై చిన్న చిన్న స్టిక్కర్లు అతికించి ఉంటాయి కదా.. అవి ఎందుకో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి..
Stickers On Fruits
Follow us

|

Updated on: Nov 28, 2022 | 1:30 PM

మార్కెట్‌ ఎప్పుడూ కూడా సీజనల్ పండ్లతో నిండిపోయింది. మార్కెట్‌కి వెళ్లినప్పుడు రకరకాల పండ్లపై చిన్న చిన్న పేపర్‌ స్టిక్కర్‌లు అతికించి ఉండడం అందరం గమనించే ఉంటాం. పండు మీద అలాంటి స్టిక్కర్ ఎందుకు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? స్టిక్కర్ల ఉంటే పండ్ల నాణ్యత బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. ఇంకా స్టిక్కర్ ఉన్న పండ్లు ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి దిగుమతి చేసుకున్నవని కూడా చాలా మంది భావిస్తారు. స్టిక్కర్ ఉన్న  పండును తినవచ్చని కొందరు అనుకుంటారు. అయితే అవి నిజమేనా..? లేదా స్టిక్కర్ వెనుక మరో నిజం దాగి ఉందా..? అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా..?

‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ ఇటీవల కాలంలో ఈ స్టిక్కర్ల వినియోగం గురించి ఓ ట్వీట్ చేసింది. FSSAI ప్రకారం.. ప్రపంచంలోని వివిధ దేశాలలో పండ్లు, కూరగాయలపై ఇటువంటి స్టిక్కర్లను అతికిస్తారు. ఇది పండు నాణ్యత, ధర ఇంకా పండును ఎలా పండించారనే సమాచారాన్ని సూచిస్తుంది. కానీ భారతదేశంలో వేరేలా ఇటువంటి స్టిక్కర్లను ఉపయోగిస్తారు. చాలా మంది స్టిక్కర్లు మంచివని అనుకుంటారు. కానీ భారతదేశంలో స్టిక్కర్ల ఫలితంగా అలాంటి నియమాలు వర్తించవు. కాబట్టి స్టిక్కర్ ఉన్న పండ్లను కొనుగోలు చేయడం ద్వారా మీరు మోసపోరని భావించడానికి ఎటువంటి కారణం లేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ చేసిన ట్వీట్..

ఇవి కూడా చదవండి

కానీ ప్రపంచంలోని ఇతర దేశాలలో ఈ స్టిక్కర్లను పండ్లు లేదా కూరగాయల నాణ్యతను సూచించడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా, మీకు కావాలంటే మీరు ఆ స్టిక్కర్‌ను తినవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో పండుపై అంటించిన స్టిక్కర్‌ను తినడం వల్ల శరీరానికి పెద్దగా హాని కలగదు. అయితే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ స్టిక్కర్‌ని తినమని సిఫారసు చేయడం లేదు. ఎఫ్‌డీఏ ప్రకారం, ఈ స్టిక్కర్లు పండ్లు, కూరగాయలు తినడానికి సురక్షితంగా ఉన్నాయని సూచిస్తాయి. కానీ స్టిక్కర్లు తినదగినవా కాదా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

FSSAI తెెలిపిన సమాచారం ప్రకారం.. పండ్ల ఉత్పత్తిలోని లోపాలను దాచిపెట్టడానికి మన దేశంలో పండ్లపై ఈ స్టిక్కర్లను అతికిస్తున్నారు. పండ్లకు స్టిక్కర్లను అంటించడానికి గమ్ లేదా జిగురును ఉపయోగిస్తారు. అందువల్ల స్టిక్కర్ ఉన్న పండ్లను తినే ముందు తగుజాగ్రత్తలు తప్పక పాటించాలి. అటువంటి పండ్లను ముందుగా బాగా కడగాలి. ఆ తర్వాత మాత్రమే తినాలి. ఆ స్టిక్కర్‌ను ఎట్టిపరిస్థితిలోనూ తినకూడదు. స్టిక్కర్లకు గమ్ లేదా జిగురు ఉన్నందున వీటిని తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.