Telangana: ఊరు ఊరంతా మేకలు బలి.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఆ ఊరులో ఏ గల్లీ చూసినా రక్తపాతమే..! అలా అని‌ ఏ గొడవ జరగలేదు.. ఏ వ్యక్తికి గాయం కాలేదు. కానీ ఊరిలో మాత్రం రక్తం ఏరులై పారింది. ఆ రక్తం మేకలది. ఒకటో రెండో కాదు పదుల సంఖ్యలో మేకల తలలు తెగిపడ్డాయి. కారణం ఆ ఊరు ఊరంతా జ్వరాల బారిన పడటమే..!

Telangana: ఊరు ఊరంతా మేకలు బలి.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Poojalu
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 22, 2024 | 5:41 PM

ఆ ఊరులో ఏ గల్లీ చూసినా రక్తపాతమే..! అలా అని‌ ఏ గొడవ జరగలేదు.. ఏ వ్యక్తికి గాయం కాలేదు. కానీ ఊరిలో మాత్రం రక్తం ఏరులై పారింది. ఆ రక్తం మేకలది. ఒకటో రెండో కాదు పదుల సంఖ్యలో మేకల తలలు తెగిపడ్డాయి. కారణం ఆ ఊరు ఊరంతా జ్వరాల బారిన పడటమే..! అవును.. ఇంటికొకరు చొప్పున మంచం పట్టడంతో ఊరికి ఏదో గాలి సోకిందని.. ఊరు బాగుండాలంటే.. జనమంతా ఆయురారోగ్యాలతో ఉండాలంటే పోశమ్మ శాంతి పూజలు చేయాలని ఊరు పెద్దలు నిర్ణయించారు. దీంతో ఊరు ఊరంతా ఒక్కటై సామూహికంగా మేక బలులకు శ్రీకారం చుట్టారు. ఈ ఘటన మంచిర్యాల‌ జిల్లా దండెపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

కన్నెపల్లి గ్రామంలో కొత్త ఆచారానికి లేపారు ఆ ఊరి ప్రజలు. ఊరు ఊరంతా విష జ్వరాలతో మంచం పట్టడంతో ఊరికి పీడ పట్టుకుందని.. మంచి జరగాలంటే ఊరు దేవరకు శాంతి పూజలు చేయాలని‌ డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడువుగా ఊరు ఊరంతా ఒక్కటై మేకలను పోచమ్మకు బలి ఇచ్చి శాంతి పూజలు నిర్వహించారు. వర్షకాలం ప్రారంభంలో వాడ పోశమ్మకు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నా.. ఊరు ఊరంతా కలిసి ఇలా ఒకేసారి బలి కార్యక్రమం చేయడం ఇదే మొదటి సారి అని ఆ ఊరు పెద్దలు తెలిపారు. పండుగ వాతావరణంలా ఇలా మొక్కులు చెల్లించుకుంటే ఊరికి పట్టిన పీడ గాలి పోతోందని.. అంతా ఆయురారోగ్యాలతో ఉంటారని కన్నెపల్లి గ్రామస్తులు తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..