Swiggy Orders: ఈ రేంజ్‌లో తింటున్నారా?.. చికెన్ బిర్యానీ ఆర్డర్లపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన స్విగ్గీ..

బిర్యానీ.. ఆ పదం వింటే ఉవ్విళ్లూరుతాయి. బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అకేషన్ అయినా.. ఫ్రెండ్స్‌తో సరదాగా..

Swiggy Orders: ఈ రేంజ్‌లో తింటున్నారా?.. చికెన్ బిర్యానీ ఆర్డర్లపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన స్విగ్గీ..
Biryani
Follow us

|

Updated on: Dec 23, 2020 | 5:46 AM

Swiggy Orders: బిర్యానీ.. ఆ పదం వింటే ఉవ్విళ్లూరుతాయి. బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అకేషన్ అయినా.. ఫ్రెండ్స్‌తో సరదాగా బయటకు వెళ్లినా.. ఫ్యామిలీతో కలిసి హోటల్‌కు వెళ్లినా.. హాలిడేని ఇంట్లో ఎంజాయ్ చేసినా.. ముందుగా తినడానికి ప్రాధాన్యత ఇచ్చే ఫుడ్ బిర్యానీ. బిర్యానీ అంటే అంత స్పెషల్ మరి. రకరకాల బిర్యానీలు ఉన్నప్పటికీ ముందుగా అందరి నోట పలికేది చికెన్ బిర్యాని. ఈ విషయాన్ని మేము మాత్రమే కాదండోయ్.. ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ సైతం ధృవీకరించింది. చికెన్ బిర్యానీ విక్రయాలు దేశంలో రికార్డ్‌ను సృష్టిస్తున్నాయట. ఎలా అంటే.. ఒక్క వెజ్ బిర్యానీ ఆర్డర్ వస్తే అదే సమయంలో ఆరు చికెన్ బిర్యానీలకు ఆర్డర్ పెడుతున్నారట బిర్యానీ ప్రియులు. ఈ విషయాన్ని స్విగ్గీ తన వార్షిక విశ్లేషణలో వెల్లడించింది. ఇంకా చాలా విషయాలే చెప్పిందండోయ్. అవేంటంటే.. దేశ వ్యాప్తంగా ప్రతి సెకన్‌కు ఒకటి కంటే ఎక్కువ బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయట. అంతేకాదు.. తమ యాప్‌లో కొత్తగా లాగిన్ అయి మూడు లక్షలకు పైగా వినియోగదారులు తమ తొలి ప్రాధాన్య ఆహారంగా చికెన్ బిర్యానీనే బుక్ చేశారట. ఇక చికెన్ బిర్యానీ తరువాత ఇంటి వంటకాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. వీటి స్థానంలో తరువాత పానీ పూరికి విపరీతమైన ఆర్డర్లు వచ్చాయంది. ఇదిలాఉంటే.. హైదరాబాద్‌ ధమ్ బిర్యానీకి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ దేశాలకు చెందిన సెలబ్రిటీలు సైతం హైదరాబాద్ ధమ్ బిర్యానీకి ఫిదా అయ్యారు. తమ ఫేవరెట్ ఫుడ్‌‌లో హైదరాబాద్ ధమ్ బిర్యానీకి స్థానం కూడా ఇచ్చారు.

Also read:

Kilauea Volcano Explosively : హవాయిలోని బద్దలైన కిలాయియా అగ్నిపర్వతం.. ఉవ్వెత్తున ఎగిసిన అగ్ని కీలలు..

ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తప్పనిసరిగా తినాల్సిందే.. వీటితో కంటికి కనిపించని వైరస్ ఖతం..