Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daria I Noor: కోహినూర్‌కు సోదరి ‘పింక్ సిస్టర్’ నిజంగానే ఉందా?.. 117 ఏళ్ల తర్వాత తెరపైకి..

మన దేశంలోని కొల్లూరు గని నుంచి తవ్వి తీసిన కొహినూర్ వజ్రం గురించి ప్రపంచానికి తెలుసు. అయితే, అదే ప్రాంతం నుంచి తవ్వి తీసిన, కొహినూర్‌కు 'పింక్ సిస్టర్' గా పిలువబడే మరో అపురూప వజ్రం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదే దరియా-ఎ-నూర్ (Daria-i-Noor). ఈ వజ్రం 117 సంవత్సరాలుగా రహస్యంగా ఉంది. తాజాగా, బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం దీనిని ప్రపంచానికి ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా బంగ్లాదేశ్ ప్రభుత్వ బ్యాంకు రహస్య ఖజానాలో ఉన్న దరియా-ఎ-నూర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Daria I Noor: కోహినూర్‌కు సోదరి ‘పింక్ సిస్టర్’ నిజంగానే ఉందా?.. 117 ఏళ్ల తర్వాత తెరపైకి..
Unveil Daria I Noor The 'pink Sister' Of Koh I Noor
Bhavani
|

Updated on: Oct 10, 2025 | 9:45 PM

Share

గోల్కొండ గని నుంచి తవ్విన దరియా-ఎ-నూర్ వజ్రం, దీనిని అప్పటి నవాబు రుణం కోసం తాకట్టు పెట్టాడు. దీనిని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించనుంది. భారతదేశానికి గర్వకారణమైన కొహినూర్ వజ్రం వలె, దరియా-ఎ-నూర్ కూడా భారతదేశ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉంది. మళ్లీ శతాబ్దం తర్వాత ఈ వజ్రం గురించిన చర్చ మళ్లీ మొదలైంది. ఇప్పటివరకూ ఎవరి కంటా పడని ఈ వజ్రం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

వజ్రం నేపథ్యం:

దరియా-ఎ-నూర్ 26-క్యారెట్ల వజ్రం. ఇది దీర్ఘచతురస్రాకార ఉపరితలం, టేబుల్ ఆకారాన్ని కలిగి ఉంటుంది.

దీనిని మహారాజా రంజిత్ సింగ్ ధరించేవారు. ఆయన చేతికి కొహినూర్, దరియా రెండు వజ్రాలూ ఉండేవి.

సింగ్ మరణానంతరం ఈ వజ్రాన్ని బ్రిటిష్ వారు తీసుకున్నారు. అయితే, బ్రిటిష్ క్రౌన్‌కు ఇది అంతగా నచ్చకపోవడంతో, దీనిని తిరిగి భారతదేశానికి ఇచ్చారు.

1862లో ఢాకా మొదటి నవాబు అయిన ఖావాజా అలిముల్లా దీనిని వేలంలో కొనుగోలు చేశారు.

తాకట్టు కథ:

ధాకా నవాబ్ సలీముల్లా ఆర్థిక సమస్యల కారణంగా ఈ దరియా-ఎ-నూర్ సహా ఇతర ఆభరణాలను అప్పటి బెంగాల్, అస్సాం ప్రావిన్స్ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు.

ప్రతిఫలంగా ఆయన 1.4 మిలియన్ రూపాయల రుణం పొందారు.

ఈ రుణాన్ని 30 ఏళ్లలో 3 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే, రుణం తిరిగి చెల్లించబడలేదు.

117 ఏళ్ల రహస్యం:

రుణం చెల్లించకపోవడం వలన, దరియా-ఎ-నూర్ అప్పటి నుండి ప్రభుత్వ రక్షణలోనే ఉంచబడింది.

గత 117 ఏళ్లుగా ఇది బంగ్లాదేశ్‌లోని సోనాలి బ్యాంక్ ఖజానాలో లాక్ చేయబడి ఉంది.

బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ వజ్రాన్ని బహిరంగంగా ఆవిష్కరించాలని యోచిస్తోంది. 117 ఏళ్ల సగటు ద్రవ్యోల్బణం ప్రకారం, నవాబ్ తీసుకున్న రుణం విలువ 2025 నాటికి సుమారు 1,320–1,348 కోట్ల బంగ్లాదేశ్ టాకా ఉండవచ్చు.

అధికారిక రికార్డుల్లో ఈ వజ్రం పేరు ఉన్నప్పటికీ, ఇంతవరకు ఎవరూ దీనిని చూడలేదు. అందుకే దీనిని కొహినూర్ ‘పింక్ సిస్టర్’ గా చెబుతున్నారు.