Swiggy: స్విగ్గీ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..! ఇప్పుడు ఆ రెండు రోజులు సెలవు..

Swiggy: ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. పురుషులతో పాటుగా అన్ని పనులు చేస్తున్నారు. పెద్ద కంపెనీ అయినా, చిన్న పరిశ్రమ అయినా

Swiggy: స్విగ్గీ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..! ఇప్పుడు ఆ రెండు రోజులు సెలవు..
Swiggy Womens

Swiggy: ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. పురుషులతో పాటుగా అన్ని పనులు చేస్తున్నారు. పెద్ద కంపెనీ అయినా, చిన్న పరిశ్రమ అయినా మహిళలు 100% శాతం పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ మహిళా ఫుడ్ డెలివరీ ఉద్యోగుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఈ నిర్ణయంతో వారికి పెద్ద ఇబ్బంది తప్పినట్లయింది. మహిళా ఉద్యోగులకు నెలలో రెండు రోజులు పీరియడ్ లీవ్స్ ఇస్తామని ప్రకటించింది.

కంపెనీ ఆ సమయంలో జీతం కట్‌ చేయడం వంటివి ఉండవని.. ఎటువంటి ప్రశ్నలు కూడా అడగదని చెప్పింది. సంస్థ అధికారికంగా ఈ విషయాన్న ప్రకటించడం విశేషం. ఈ విషయం గురించి స్విగ్గీస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్ మిహిర్ షా ఇటీవల బ్లాగ్‌లో పోస్ట్ చేసారు. పీరియడ్స్‌ సమయంలో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారిన అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతేకాదు మహిళలు ఈ రంగంలో పనిచేయడానికి ముందుకు రాకపోవడానికి ఇదే కారణమని పేర్కొన్నారు. అందుకే మహిళలకు ప్రతి నెలా రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తామని తెలిపారు.

Swiggy ప్రకారం.. మొదటి మహిళా ఉద్యోగి 2016 సంవత్సరంలో ఈ కంపెనీలో డెలివరీ ఏజెంట్‌గా చేరారు. గతంలో కూడా ఈ రంగంలో మహిళలన ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి స్విగ్గీ కంటే ముందు అంటే గత ఏడాది ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన మహిళా డెలివరీ కార్మికుల కోసం సంవత్సరంలో10 రోజులు వేతనంతో కూడిన సెలవు దినాలను ప్రారంభించింది.

Lemon: నిమ్మకాయ చిన్నదే.. కానీ ఉపయోగాలు బోలెడు.. అవేంటంటే..

Samantha: సమంతకు అమ్మ చెప్పిన మాట ఇదే.. అందుకే అంత ధైర్యం ఆమెకు!.. వైరల్ అవుతున్న పోస్ట్..

IT Returns: మీ ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? అయితే మీరు ఈ ఫారమ్‌ను పూర్తి చేయకపోతే మీరు రిటర్న్స్ పొందలేరు

Click on your DTH Provider to Add TV9 Telugu