Coins: రూ. 10 కాయిన్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జైలుకు వెళ్లాల్సిందే..

|

Sep 24, 2024 | 1:06 PM

అవునురూ. 10 కాయిన్‌ తీసుకోకపోవడం ముమ్మాటికీ చట్టరీత్యా నేరం. ఎవరైనా కాయిన్‌ తీసుకోమని చెబితే వారిపై ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది. అంతేనా వారికి శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. రూ. 10 నాణేనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే సదరు వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయొచ్చు. ఇండియన్ కరెన్సీ యాక్ట్‌, ఐపీసీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయొచ్చు...

Coins: రూ. 10 కాయిన్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జైలుకు వెళ్లాల్సిందే..
Coins
Follow us on

రూ. 10 కాయిన్‌ తీసుకోవడానికి నిరాకరించిన సంఘటనలు మనలో చాలా మందే ఎదుర్కొని ఉంటారు. అసలు ఎందుకు వద్దు అంటున్నారో తెలియదు, తీసుకోకూడదని ఎవరి చెప్పారో తెలియదు. కానీ చాలా మంది మాత్రం వీటిని తీసుకోవడానికి నికారనిస్తున్నారు. అయితే రూ. 10 కాయిన్ తీసుకోకూడదనేది ఎక్కడా లేదు. ఏ చట్టం కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. అయితే ఇలా ఈ కాయిన్స్‌ను వద్దు అని చెప్పడం నేరమని మీకు తెలుసా.?

అవునురూ. 10 కాయిన్‌ తీసుకోకపోవడం ముమ్మాటికీ చట్టరీత్యా నేరం. ఎవరైనా కాయిన్‌ తీసుకోమని చెబితే వారిపై ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది. అంతేనా వారికి శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. రూ. 10 నాణేనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే సదరు వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయొచ్చు. ఇండియన్ కరెన్సీ యాక్ట్‌, ఐపీసీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయొచ్చు. అంతేకాదు రిజర్వ్‌ బ్యాంకుకు కూడా ఫిర్యాదు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.

చెలామణిలో ఉన్న నాణేలను, నోట్లను తీసుకోవడానికి నిరాకరించిన వారికి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 489A, 489E కింద నేరాలు పడే అవకాశం ఉంటుంది. ఈ చట్టం ప్రకారం న్యాయస్థానం వీరికి జరిమానా విధించడం లేదా జైలు శిక్ష.. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా మీ నుంచి రూ. 10 నాణేన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే అవసరమైన సాక్ష్యాలతో కేసు నమోదు చేసుకోవచ్చు.

కాయిన్‌ తీసుకోకూడదని వస్తున్న వార్తలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇది వరకే చాలా సార్లు ప్రకటనలు చేసింది. రూ.10 నాణేనికి సంబంధించి వస్తున్న పుకార్లు తప్పని ఆర్బీఐ పేర్కొంది. అన్ని రకాల లావాదేవీలకు రూ. 10 నాణేలను ఎలాంటి ఆక్షేపన లేకుండా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..