Black Hole: భూమికి అతి దగ్గరగా భారీ బ్లాక్‌ హోల్‌.. సూర్యుడికంటే 10 రెట్లు పెద్దగా..

ఈ కృష్ణబిలం నక్షత్ర మండలానికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు తెలిపారు. ఇంతకు ముందు కనుగొన్న కృష్ణబిలం కంటే..

Black Hole: భూమికి అతి దగ్గరగా భారీ బ్లాక్‌ హోల్‌.. సూర్యుడికంటే 10 రెట్లు పెద్దగా..
Black Hole
Follow us

|

Updated on: Nov 07, 2022 | 8:45 PM

ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఓ భారీ కృష్ణబిలాన్ని కనుగొన్నారు. సూర్యుడికంటే 10 రెట్లు పెద్దగా ఉన్న ఈ బ్లాక్‌ హోల్‌ భూమికి అతి దగ్గరగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కృష్ణబిలం నక్షత్ర మండలానికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు తెలిపారు. ఇంతకు ముందు కనుగొన్న కృష్ణబిలం కంటే ఇది భూమికి మూడు రెట్లు చేరువలో ఉంది. ఇది నక్షత్ర ద్రవ్యరాశి విభాగానికి చెందినదని పరిశోధకులు భావిస్తున్నారు. అంతేకాదు అసాధారణమైన అంతరిక్ష భాగాల పరిణామక్రమం గుట్టు విప్పేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, పాలపుంతలో నిద్రాణ స్థితిలో ఉన్న కృష్ణబిలాన్ని స్పష్టంగా గుర్తించడం ఇదే మొదటిసారి. నక్షత్ర ద్రవ్యరాశి సహిత కృష్ణబిలాలు సూర్యుడి ద్రవ్యరాశితో పోల్చితే 5 నుంచి 100 రెట్లు అధిక బరువున్న ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇలాంటివి ఒక్క పాలపుంతలోనే 100 మిలియన్ల వరకు ఉంటాయట. ఈ వివరాలు రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ నెలవారీ ప్రచురణల్లో చోటుచేసుకున్నాయి. ఈ కృష్ణబిలంతో పాటు ఉన్న మరో నక్షత్రాన్ని కూడా పరిశోధకులు హవాయిలో ఉన్న జెమినీ నార్త్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం..