ఈ సరస్సులో అప్సరసలు స్నానం చేసేవారట..! మీరెప్పుడైనా తిలకించారా.. అయితే ఓ లుక్కేయండి..

Apsarkonda Waterfalls : ఇప్పుడు చెప్పబోయే ప్రదేశం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. అదే కర్ణాటక రాష్ట్రంలోని

ఈ సరస్సులో అప్సరసలు స్నానం చేసేవారట..! మీరెప్పుడైనా తిలకించారా.. అయితే ఓ లుక్కేయండి..
Follow us

|

Updated on: Feb 24, 2021 | 4:59 AM

Apsarkonda Waterfalls : ఇప్పుడు చెప్పబోయే ప్రదేశం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. అదే కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నవర్ కు సమీపంలో ఉన్న అప్సర కొండ గ్రామం. అప్సర కొండ అంటే దేవతల కొలను అని అర్ధం. దేవతలు స్నానం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చే వారని పురాణ కధనం. సిటీ లైఫ్ నుండి దూరంగా ప్రకృతి అందాల మధ్య సమయం గడపాలని కోరుకునే వారికి ఈ గ్రామం సరైన ఎంపిక. అప్సరకొండ జలపాతం ఎన్నో పర్యాటక ఆకర్షణలతో కూడుకుని ఉంటుంది. ఈ గ్రామంలోని అందాలు, జలపాతం హొయలు టూరిస్టులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.

సుమారు 50 అడుగుల ఎత్తు నుండి పడే అప్సరకొండ జలపాతాలు క్రింద సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులోకి వెళతాయి. టూరిస్టులు మెరిసే జలపాతం దృశ్యాలతో పాటు కొండ పై నుండి అద్భుతమైన సూర్యాస్తమయం దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు. మనోహరమైన సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలకు అప్సర కొండ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహా గణపతి, ఉగ్ర నరసింహ ఆలయాలు కూడా ఉన్నాయి. అప్సర కొండ జలపాతం అనేక చెట్ల మూలాల గుండా ప్రవహించడం వల్ల ఈ నీటికి గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

అప్సరకొండకు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవడం ఒక గొప్ప అనుభవం అని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో పర్యాటకులు సందర్శించేందుకు అనేక సహజ గుహలు కూడా ఉన్నాయి. పాండవులు వనవాసం సమయంలో ఈ గుహల్లో కొంత కాలం నివసించినట్లు పురాణ కధనం ఉంది. అందుకే వీటికి చూసేందుకు టూరిస్టులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వర్షాకాలం ఈ జలపాతాల సందర్శనకు సరైన సమయం. కాబట్టి ఇక్కడికి వెళ్లాలనుకునే పర్యాటకులు జూన్ నుండి అక్టోబర్ మధ్య ట్రిప్ ను ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్సరకొండ జలపాతాలను చేరుకోవడానికి అన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హొన్నవర్ నుండి ఈ జలపాతాలకు 6 కిలోమీటర్ల దూరం.

Central Electoral Commission: బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలపై కసరత్తు..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..