Boy Complaint: సైకిల్ పోయిందని పోలీసులకు బాలుడి ఫిర్యాదు.. తండ్రికి ఫోన్ చేసి అవాక్కైన పోలీసులు!

ఇప్పటికీ చాలామంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే జంకుతారు. తనకు జరగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పాలంటేనే భయపడుతారు.

Boy Complaint: సైకిల్ పోయిందని పోలీసులకు బాలుడి ఫిర్యాదు.. తండ్రికి ఫోన్ చేసి అవాక్కైన పోలీసులు!
Cycle Boy
Follow us

|

Updated on: Jan 20, 2022 | 5:59 PM

Boy complained Police for Cycle missing: ఇప్పటికీ చాలామంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే జంకుతారు. తనకు జరగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పాలంటేనే భయపడుతారు. తమ ఇళ్లల్లో ఏదైనా చోరీ జరిగినప్పటికీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి కాస్త తటపటాయిస్తారు. పోయిన వస్తువు గురించి పక్కనబెడితే, వాళ్లు ఇంటాగేషన్‌తో వేధింపులకు గురిచేస్తారని ఒకింత భయం కూడా ఉంటుంది. అందుకే పోలీసుల వద్దకు వెళ్లాలంటే పెద్దపెద్ద వాళ్లే జంకుతారు. అలాంటిది పోలీసులంటే భయం లేకుండా, ఎంతో ధైర్యంగా బుడతలు కొందరు ఇటీవల కాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఆరోవ తరగతి చదువుతున్న ఓ కుర్రాడు పోలీస్ స్టేషన్ వెళ్లి మరీ ఫిర్యాదు చేశాడు. లవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి వచ్చాడో కుర్రాడు. ఇంటికి వచ్చేసరికి అతని సైకిల్ పోయింది. దీంతో తన సైకిల్ వెతికిపెట్టమని పోలీసులను ఆశ్రయించాడు. ఆ బాలుడి ధైర్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. తీరా అసలు విషయం తెలుసుకుని నోరెళ్లబెట్టారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగుచూసింది.

బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన భువనగిరి సాత్విక్ (11 ) ఆరో తరగతి చదువుతున్నాడు. బుధవారం అతడు బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. పోయిన సైకిల్ వెతికిపెట్టాలని ఎస్ఐ‌కి ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడు ధైర్యం చూసి ముచ్చటపడిన ఎస్ఐ ఆవుల తిరుపతి అతడి తండ్రికి ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే తండ్రి చెప్పిన మాటలు విన్న ఎస్‌ఐకి దిమ్మతిరిగింది.

తన కొడుకు సాత్విక్ సైకిల్‌ వేసుకుని ఎక్కువగా బయట తిరుగుతున్నాడని, కరోనా సమయంలో అలా బయట తిరగొద్దని ఎంత చెప్పినా వినడం లేదని ఆ తండ్రి ఎస్‌ఐకి చెప్పారు. చెప్పిన మాట వినడం లేదన్న కారణంతో తానే ఆ సైకిల్ దాచిపెట్టానని తెలిపారు. ఈ విషయాన్ని ఎస్ఐ… సాత్విక్‌కు చెప్పడంతో ఎగిరి గంతేశాడు. అయితే, ఎలాంటి భయం లేకుండా, ఎవరి సహాయం లేకుండా ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సాత్విక్‌ను ఎస్ఐ తిరుపతి సహా పోలీసు స్టేషన్ సిబ్బంది అభినందించారు.

Read Also…  షాకింగ్‌.. విరాట్‌ కోహ్లీపై చర్యలకు సిద్దమవుతున్న గంగూలీ.. షోకాజ్ నోటీసు రెడీ..?

Telugu Akademi Scam: తెలుగు అకాడమీ స్కామ్‌‌లో కొత్త ట్విస్ట్.. మరో భారీ స్కామ్‌కు ప్రధాన సూత్రధారి స్కెచ్‌!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.