అపోలోకి ఉచితంగా కరోనా టెస్టింగ్ కిట్లను అందించిన హెచ్‌యుఎల్

భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తి కట్టడికి 74వేల టెస్టింగ్ కిట్లను విరాళంగా అందించిన హెచ్‌యుఎల్. రోగులకు ఉచితంగా పరీక్షలను చేయడానికి ఆర్‌టీ-పీసీఆర్ కిట్లను హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్స్‌కు 17,280కిట్లను విరాళంగా అందజేత.

అపోలోకి ఉచితంగా కరోనా టెస్టింగ్ కిట్లను అందించిన హెచ్‌యుఎల్
Follow us

|

Updated on: Jun 03, 2020 | 5:10 PM

ప్రపంప వ్యాప్తంగా కరనా వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు. కరోనా నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు సాగుతున్నారు. కొవిడ్-19 పరీక్షలు నిర్వహించి సమూల నివారణకు సహకరిస్తున్నారు. తాజాగా ఆరోగ్య సిబ్బందికి చేయూతనిచ్చేందుకు హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) ముందుకొచ్చింది. దేశంలో క్రమ క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కోవిడ్-19 రోగులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాలతో పాటు.. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల ప్రభుత్వాలకు చేయూతనందిస్తోంది హెచ్‌యుఎల్. తమ ఉత్పత్తులను విరాళంగా ఇవ్వడంతో పాటు వైద్య పరికరాలను టెస్టింగ్ కిట్లను అందజేసింది. తాజాగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు 17,280 ఆర్‌టీ-పీసీఆర్ కిట్లను అందజేసింది హెచ్‌యుఎల్. కరోనా లక్షణాలు కలిగిన రోగులకు మరింత వేగంగా పరీక్షలను చేసేందుకు కిట్స్ ఉపయోగపడనున్నాయి. ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయల విలువైన 74,328 ఆర్‌టీ-పీసీఆర్ కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను విరాళంగా అందజేసింది హెచ్‌యుఎల్. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 28,880 ఆర్‌టీ-పీసీఆర్ కిట్లను అందించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థకి 20,160 కిట్లు , మెట్రోపాలిస్ ల్యాబ్స్ కి 8,088 కిట్లను అందజేసింది హెచ్‌యుఎల్. ఈ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టింగ్ కిట్లలో న్యూక్లియక్ యాసిడ్ డయాగ్నోస్టిక్ కిట్, శాంపిల్ రిలీజ్ రీఏజెంట్, థ్రోట్ స్వాబ్, పీసీఆర్ ట్యూబ్ మరియు శాంపిల్ స్టోరేజీ రీఏజెంట్ ఉన్నాయి. ఈ టెస్టింగ్ కిట్లకు అంతర్జాతీయ సర్టిఫికేషన్ సంస్థలైనటువంటి సీఈ ఐవీడీ, యుఎస్-ఎఫ్‌డీఏ, ఈయు సీఈ అనుమతించాయి. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్ధ భాగస్వామ్యం కలిగిన ఫైండ్ సైతం ఈ కిట్లను సురక్షిత జాబితాలోనూ చేర్చింది. తగినంతగా టెస్టింగ్ కిట్లు, ఇతర వైద్య సామాగ్రి సరఫరా చేయడం ద్వారా ఫ్రంట్‌లైన్ వారియర్స్ సమర్థవంతంగా కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కోగలరని హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ ఛైర్మన్ సంజీవ్ మెహతా అన్నారు. ఈ కిట్ల ద్వారా వైరస్ నిర్థారణ పరీక్షలను ఉచితంగా చేయడంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తుందన్నారు. వీటితో పాటు రూ.3 కోట్ల విలువైన 29 వెంటిలేటర్లును హెచ్‌యుఎల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా అందజేసింది. గత నెల, హెచ్‌యుఎల్ 5వేల సెట్ల పీపీఈ కిట్లు, 20వేల ఎన్95 మాస్కులు, 2లక్షల గ్లోవ్స్, 112 పల్స్ ఆక్సిమీటర్లు, రూ.2 కోట్ల విలువైన 28 ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లును మహారాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖకు అందజేసింది. నిరుపేదలకు హైజీన్ ఉత్పత్తులను అందించడం, ఆస్పత్రులలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను అందించడం, కోవిడ్ -19 వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా స్థానిక అధికారులకు సహాయపడుతూ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటుచేయడంలో హెచ్‌యుఎల్ ముందు వరసలో ఉంటోంది.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్