పుణ్యక్షేత్రానికి వెళ్తూ..తిరిగిరాని లోకాలకు

Road Accident in West Godavri, పుణ్యక్షేత్రానికి వెళ్తూ..తిరిగిరాని లోకాలకు

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు కూడా ఉన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నుంచి 11 మంది వ్యానులో రాత్రి తిరుమలకు బయలుదేరారు. మధ్యలో అన్నవరంలో బస చేసి, ఉదయం 8 గంటలకు తిరుమల పయనం అయ్యారు. నల్లజర్ల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు నీలకంఠరావు, లక్ష్మీ ఘటనా స్థలంలోనే చనిపోయారు. నీలకంఠరావు మనవడు, మనమరాలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అల్లుళ్లు ఇద్దరూ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మనవడి పుట్టు వెంట్రుకలు తీయించడానికి తిరుమల వెళ్తుండగా ప్రమాదం ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
మృతుల వివరాలుః
పలుకూరి అప్పలరాజు(35)
ఎక్కుల రామకృష్ణ (45)
తమ్మిన నీలకంఠరావు (55)
తమ్మిన లక్ష్మి (50)
ఎక్కుల తనూజ (3)
పలుకూరి జ్ఞానేశ్వర్‌(8 నెలలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *